Ads
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు కామన్. కొందరు ఏళ్ళ తరబడి ప్రేమించుకొని విడిపోతారు. మరికొందరు ప్రేమించి పెళ్లి చేసుకొని మూన్నాళ్ళ ముచ్చటగానే విడిపోతున్నారు. ఫాస్ట్ గా ప్రేమించుకోవడం, ఫాస్ట్ గా విడిపోవడం చేస్తున్నారు.
Video Advertisement
విడాకులు అనేవి ఒకప్పుడు విదేశాలకు పరిమితం అనుకునేవారు. కానీ ప్రస్తుతం మన దేశంలో కూడా విడాకులు తీసుకొనే వారి సంఖ్య పెరిగిపోయింది. పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అయిపోయాయి.
ఇటువంటి తరుణంలో తాజాగా ఒక తమిళ్ ప్రొడ్యూసర్, నటి పెళ్లి చేసుకున్నారు. కాగా వారి పెళ్లి ఫోటోలు తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. వారిద్దరికీ ఇదివరకే పెళ్లిళ్లు అయిపోయి విడాకులు తీసుకున్నారు. తాజాగా రెండో పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్, సీరియల్ నటి వీజే మహాలక్ష్మి తాజాగా పెళ్లి బంధం తో ఒక్కటయ్యారు. వీరిరువురి పెళ్లి బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకొని ఒక్కటయ్యారు.
వధువు వీజే మహాలక్ష్మి మొదట వీజే గా పనిచేసి తర్వాత నటించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం మహాలక్ష్మి సన్ టీవిలో ప్రసారమయ్యే మహరాశి సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు రవీందర్ లిబ్రా బ్యానర్లో తమిళంలో పలు సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం రవీందర్ నిర్మిస్తున్న రెండు చిత్రాల్లో మహాలక్ష్మి నటిస్తున్నారు.
వీరిద్దరి వివాహం వైరల్ కావడం పై ఈ జంట స్పందించారు. సాధారణంగా బంధువుల సమక్షములో జరిగిన తమ పెళ్లి ఇలా వైరల్ అవుతుందని ఊహించలేదని వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముందు రవీందర్ ఏ తనకు ప్రపోజ్ చేశారని మహాలక్ష్మి చెప్పారు. తరువాత తానూ కాస్త సమయం తీసుకొని ఒప్పుకున్నానని ఆమె తెలిపారు.
ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నామని వారు వెల్లడించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తమపై ఉండాలని వరుడు రవీందర్ కోరుకున్నారు. కాగా వధువు తండ్రి శంకర్ తెలుగులో పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా పని చేశారు. తమ వివాహం పై సోషల్ మీడియాలో కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగటివ్ గా స్పందిస్తున్నారని వారు వెల్లడించారు.
End of Article