కరోనా సోకితే ఇక చావేనా..? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి.! వాట్సాప్ మెసేజ్ లు చూసి భయపడకండి!

కరోనా సోకితే ఇక చావేనా..? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి.! వాట్సాప్ మెసేజ్ లు చూసి భయపడకండి!

by Anudeep

Ads

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య కరోనా(కోవిడ్ -19) వైరస్. వైరస్ సోకిందని తెలిసిన కొద్ది గంటల్లోనే వెయ్యి పడకల హాస్పిటల్ ని సిధ్దం చేసింది చైనా . అంతటి పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉన్న చైనాయే ఈ వైరస్ ధాటికి భయపడుతుంది. మిగతా దేశాల సాయం కోసం ఎదురుచూస్తున్నది . అయితే మరోవైపు మనదేశంలో దీనికి పూర్తి విరుధ్దంగా పరిస్థితి ఉంది. వైరస్ కంటే ఫాస్ట్ గా మెసేజ్లు ఫార్వర్డ్ అవుతూ ప్రజల్లో గందరగోలం సృష్టిస్తున్నాయి. అసలు ఈ కోవిడ్ -19 వైరస్ లక్షణాలేంటి ? నిజనిజాలు తెలుసుకోండి .

Video Advertisement

వైరస్ వ్యాప్తిపై , నివారణపై ఇప్పటికే ఎన్నో వార్తలు , సోషల్ మీడియాలో ఫార్వర్డ్ మెసేజ్లు . షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని కొందరు , శుభ్రత పాటించాలంటూ మరికొందరు . మన దగ్గర ఆ వైరస్ బ్రతికే ఛాన్సే లేదు , మన వాతావరణం అలాంటిది అంటూ మరికొన్ని మెసేజ్లు . వీటన్నింటి మధ్య అసలు పరిస్థితి తెలియక టెన్షన్ కి గురయ్యేవారే అధికం. నిజానికి కరోనా కంటే భయంకరమైన వైరస్లు ప్రపంచాన్ని గడగడలాడించాయి . ఎబోలా , సార్స్ లాంటి వైరస్లకంటే కరోనా వైరస్ భయంకరమైనది కాదు . కానీ ఇది సులభంగా వ్యాప్తి చెందగలుగుతుంది  . కరోనాకే కాదు ఏ వైరస్ పైన అయినా గెలవాలంటే ప్రధానంగా కావల్సింది వ్యాప్తి కాకుండా చూడగలగడం .

గతంలో నిఫా వైరస్ కేరళ ప్రజల్ని కలవరపెట్టింది. కానీ కేరళ ప్రభుత్వం చాలా పటిష్టమైన ప్రణాళికతో నిఫా వైరస్ పై గెలిచి , వైరస్ వ్యాప్తి చెందకుండా చేయగలిగింది. కేరళ లాంటి వ్యవస్థే ప్రతి రాష్టంలో ఉందా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. అటువంటప్పుడు వ్యాప్తి చెందకుండా ఎలా చేయగలం. అవగాహన కల్పించాలి , దీంట్లో మీడియా ప్రధాన పాత్ర పోషించాలి . అభినందన్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించినట్టు, ఇప్పుడు కూడా మీడియా అదే ధోరణిలో పోతే చాలా కష్టం.

రెండు రోజుల క్రితం కంటే పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉంది దీనికి ప్రధాన కారణం కేవలం మెసేజ్లు , వార్తలే . కరోనా వ్యాధి అంతమందికి సోకింది , కరోనా సోకిన వారి సంఖ్య ఇంతంటూ ఎన్నో ఫేక్ మెసేజ్లు సోషల్ మీడియాలో వైరస్ కంటే ఫాస్ట్ గా ఫార్వర్డ్ అవుతున్నాయి. నిజానికి ఇతర వైరసులు సోకి మరణిస్తున్న వారి సంఖ్య కంటే కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువ .అంతేకాదు అన్ని వయసుల వారు దీని బారిన పడరు .

ఇంకొక విషయం వైరస్  దాడి, మరణాల సంఖ్య  మన రోగనిరోధక శక్తిపై డిపెండ్ అయి ఉంటుంది . చిన్నపిల్లలు , యుక్త వయసుల వారికి ఈ వైరస్ సోకేది తక్కువే , సోకినా వారి రోగ నిరోధక వ్యవస్థని బట్టి వైరస్ ని ఎదుర్కోగలరు . కానీ ముసలి వాళ్లు , యాభై ఏళ్ల పై బడిన వారిలో రోగ నిరోధక శక్తి అంత పటిష్టంగా ఉండని కారణంగా వైరస్ భారిన పడే అవకాశాలున్నాయి . కాబట్టి కొన్ని ఏజ్ గ్రూపుల వాళ్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.

చైనాలో 80000మందికి వ్యాధి సోకితే అందులో మరణాల సంఖ్య మూడు వేలు , ఇప్పటికే చాలామందికి మెడికేషన్ ఇచ్చి ఇళ్లకు పంపించేశారు . కొంతమందికి సీరియస్ గా వైధ్య సేవలు అందిస్తున్నారు . మన దగ్గర ఇంత వరకు కేవలం ఒక్కటే పాజిటివ్ కేసు  నమోదైంది . 47 అనుమానిత కేసుల్లో 45 నెగటివ్ అని వచ్చింది , వారిని ఇళ్లకి పంపించేసారు .మిగతా రెండింటి సాంపిల్స్ ని మరిన్ని పరీక్షల కోసం పూణెకి తరలించారు . మనకొస్తున్న మెసేజ్ ని అందరికి ఫార్వర్డ్ చేసేముందు అందులో వాస్తవం ఎంతుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

 

 


End of Article

You may also like