Ads
సోషల్ మీడియా లో ఇటీవలి కాలం లో పలు పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి..సామాన్యులకి ఎలాంటివి నమ్మాలో ఎలాంటివి నమ్మకూడదో తెలియట్లేదు..! కొన్ని సార్లు ఆ వార్తలు ఏ స్థాయిలో ఉంటాయంటే..పలువురి మనోభావాలు తీవ్రంగా దెబ్బతినేలాగా..మనసు నొప్పించే లాగా ఉంటాయి.కొన్ని సందర్భాల్లో.ఇది నిజమే అని నమ్మిన వారు వాటిని వెంటనే ఆ న్యూస్ ని వారికి తెలిసిన స్నేహితులకి,బంధు మిత్రులకి షేర్ చేస్తూ ఉంటారు..! ఆలా అందరికీ పాకిపోతూ ఉంటుంది.
Video Advertisement
అలాంటి ఒక వార్త ఇటీవలే ఒకటి చక్కర్లు కోట్టింది.అదేమనగా..జానకమ్మ గారి పరిస్థితి విషమంగా ఉందని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దానిపై బాలసుబ్రమణ్యం గారు ఆగ్రహం వ్యక్తం చేసారు. జానకమ్మ గారు క్షేమంగా ఉన్నారు అని క్లారిటీ ఇచ్చారు. ఇకనైనా అలాంటి రాతలు రాసే వారు పద్దతి మార్చుకుంటే మంచిది. జానకమ్మ గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సడన్ గా అలాంటి వార్తలు చదివి వారికి హార్ట్ ఎటాక్ రావచ్చు. అలాంటివి రాయడం వల్ల మీకేం వస్తుంది అని బాలు గారు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వీడియోను పలువురు సెలబ్రిటీస్ కూడా షేర్ చేసారు.
ఇలాంటి.సున్నితమైన విషయాలలో..ఎలా ప్రవర్తించాలో తెలియదా ? అంటూ. నెటిజన్స్ ఆగ్రహావేశాలు వ్యక్త పరుస్తున్నారు.ఇలాంటి వార్తలను,..నివారించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మళ్లీ..మళ్లీ ఇలాగె పునరావృతం అవ్వడం బాధాకరమైన విషయం.!విషయం తెలిసిన తరువాత తిరిగి సెలెబ్రెటీలు మన ముందుకు వచ్చి వివరణ ఇచ్చేకునే పరిస్థితి రావటం అసల ఏమి బాగోలేదు
End of Article