Ads
చాలామంది యువతి యువకులు భవిష్యత్తులో ఏం చేయాలో ఒక గోల్ ఏర్పరచుకుంటారు. అందుకోసం చిన్నప్పటి నుంచే కష్టపడుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి ఒక గోల్ పెట్టుకుంటే అందులో ఆశ్చర్యం లేదు కానీ మనం చెప్పుకోబోయే మహిళ అనేక రంగాలలో రాణించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భిన్నమైన రంగాలలో తన ప్రతిభని చాటుకుంటూ ముందుకి దూసుకుపోతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, ఒక బాస్కెట్ బాల్ ఛాంపియన్ గా మోడల్ గా పనిచేసిన ఈమె సక్సెస్ఫుల్ కెరియర్ జర్నీ గురించి ఒకసారి తెలుసుకుందాం.
Video Advertisement
మనం చెప్పుకోబోయే అమ్మాయి పేరు తస్కీన్ ఖాన్, ఉత్తరాఖండ్ కి చెందిన అమ్మాయి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన తస్కీన్ మిస్ ఇండియా కావాలని కలలు కన్నది, ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. కానీ సివిల్స్ కొట్టాలనే తపనతో ఆ కలని పక్కనపెట్టి సివిల్స్ కి ప్రిపేర్ అయింది. మూడుసార్లు ఓటమిని చవిచూసినప్పటికీ పట్టు పదులని విక్రమార్కుడి లాగా ప్రయత్నించి నాలుగో ప్రయత్నంలో సివిల్స్ క్లియర్ చేసి ఐఏఎస్ సాధించింది. అయితే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కి చెందిన తస్లీన్ సివిల్స్ క్లియర్ చేస్తుందని ఎవరూ ఎక్స్పర్ట్ చేయలేదు.
అయితే ఈ అమ్మాయి సివిల్స్ క్లియర్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది. తస్లీన్ ముందు ఒక ప్రొఫెషనల్ మోడల్, బాస్కెట్ బాల్ ఛాంపియన్. పాఠశాల విద్యా తరువాత ఎన్ఐటిలో అడ్మిషన్స్ సాధించింది కానీ ఆర్థిక భారం కారణంగా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లో చేరలేకపోయింది. అందుకే మిస్ ఇండియా సాధించడమే లక్ష్యంగా మోడలింగ్ కెరీర్ గా ఎంపిక చేసుకుంది. అందాల పోటీల్లో మిస్ డెహ్రాడూన్, మిస్ ఉత్తరాఖండ్ కిరీటం సొంతం చేసుకుంది.
మిస్ ఇండియా కూడా సాధించాలని కలలు కనేది కానీ యూపీఎస్సీ సివిల్స్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మిస్ ఇండియా కోరికని పక్కన పెట్టింది.నాలుగో ప్రయత్నంలో 736వ ర్యాంకు సంపాదించి ఐఏఎస్ కు ఎంపిక అయింది. అయితే దీని గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను బెస్ట్ స్టూడెంట్ కాదు క్రీడల్లో మాత్రమే రాణించాను, అయితే లక్ష్యంపై అవగాహన ఉండి చదివితే అందరూ విజేతలు అవుతారు అని చెప్పింది. నిజంగా యువతి కృషి, పట్టుదల కి హాట్సాఫ్.
End of Article