Ads
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.రాబోయే 2024 ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. వైసిపి ప్రభుత్వాన్ని దించడమే తమ లక్ష్యం అంటూ చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? బిజెపి కూడా వీరితో కలిసి జతకడుతుందా లేదా అనే విషయం పైన స్పష్టత లేదు.
Video Advertisement
అయితే పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు నాయకులకు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. సీట్ల విషయాన్ని తనకి వదిలేయాలని జనసేన ఎక్కడ నిలబడ్డ గెలిపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా టిడిపి నాయకులు కార్యకర్తలు కొన్ని త్యాగాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. దీన్నిబట్టి చూస్తే ఇరు పార్టీల లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే అని అనిపిస్తుంది. ప్రతి తాజాగా పొత్తులో ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారనే విషయం పైన కొన్ని ఊహగానాలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ 50 సీట్లకు పైగానే పోటీ చేస్తుందని తెలుస్తుంది. ఒకవేళ బిజెపి పొత్తులో ఉంటే ఐదు నుండి పది సీట్లు తీసుకోవచ్చు. మిగతా సీట్లలో టిడిపి పోటీ చేస్తుంది. అలాగే జనసేన బలంగా ఉన్న పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ శాతం సీట్లు ఆశిస్తుందని అంటున్నారు. ఈ విషయం పైన స్పష్టత రావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
End of Article