Ads
జనరల్ గా ఒక కప్పు టీ కాస్ట్ ఎంత ఉంటుంది..? 10 రూపాయలు.. అంతే కదా.. అదే ఏ హోటల్ లోనో అయితే.. 20 రూపాయలు ఉంటుందేమో.. కానీ.. ఆ రోడ్ సైడు షాపు లో మాత్రం ఒక కప్పు టీ ధర ఏకం గా వెయ్యి రూపాయలు. ఈ టీ స్టాల్ పశ్చిమ బెంగాల్ లో ఉంది. రోడ్ సైడు ఉండే ఈ షాపు లో బయట బల్లపై కూర్చుని పేపర్ చదువుతూ టీ తాగచ్చు. అందుకోసం వెయ్యి రూపాయలా అనుకోకండి..
Video Advertisement
అసలు విషయం ఏంటంటే.. ఆ టీ స్టాల్ లో దాదాపు 115 రకాల టీ లు ఉన్నాయి. వరల్డ్ లోనే అరుదు గా దొరికే జపనీస్ సిల్వర్ నీడిల్ వైట్ టీ, ఆస్ట్రేలియా లావెండర్ టీ, నైజీరియా రెడ్ వైన్ టీ, కారమెల్ టీ… ఇలా అన్ని దొరుకుతాయి. జపనీస్ సిల్వర్ నీడిల్ వైట్ టీ కి సంబంధించి ఒక్క టీ పొడి ఖరీదు కేజీ రూ.2,80,000. ఉంటుంది. అందుకే ఇక్కడ టీ అంత ఖరీదు ఉంటుంది.
ఈ టీ షాపు ఓనర్ పార్థాప్రతిమ్ గంగూలీ గతం లో ఉద్యోగం చేసుకునేవాడు. అతనికి ఎంతో ఇష్టమైన టీ బిజినెస్ చేయాలనీ భావించి ఉద్యోగాన్ని కూడా వదిలేసాడు. ఆ తరువాత రకరకాల టీలు అమ్మడం ప్రారంభించాడు. అక్కడకు వచ్చే.. ప్రతి వెయ్యి మందిలో కనీసం వందమంది రెండు మూడు సార్లు తిరిగి వస్తూ ఉంటారట. ఒకసారి ఒక టీ.. మరో సారి మరో రకం.. అలా రకరకాలు టేస్ట్ చేస్తూనే ఉంటారట.
End of Article