బెలూన్ పైన పేర్లు రాసి ఎగిరేయమని చెప్పింది ఆ టీచర్…చివరికి ఏమైందో తెలుసా?

బెలూన్ పైన పేర్లు రాసి ఎగిరేయమని చెప్పింది ఆ టీచర్…చివరికి ఏమైందో తెలుసా?

by Anudeep

Ads

“సంతోషం సగం బలం” అన్నారు పెద్దలు.. కొందరు వారి సంతోషాన్ని సినిమాలు చూడడంలో వెతుక్కుంటే, మరికొందరు ఫూడ్ లో వెతుక్కుంటారు.. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయి..కాని నిజమైన సంతోషం, ఆనందం మనకోసం మనం చేసుకునే పనుల్లో కాదు, ఇతరులకోసం మనం ఏం చేసామనే దానిపైనే, వాటిపైనే ఆధారపడి ఉంటుంది. దాని వలన మనం మాత్రమే కాదు..మన వలన వాళ్లు, వాళ్ల వలన మనం రెట్టింపు సంతోషంతో బతకొచ్చు..దీన్నే ఒక చిన్న కథతో చెప్పుకుందామా…

Video Advertisement

ఒక స్కూల్ టీచర్ ఒకరోజు స్కూల్ కి వస్తూ వస్తూ తనతో పాటు కొన్ని బెలూన్స్ తీసుకుని వచ్చింది. క్లాస్ రూంకి వెళ్లాక స్టూడెంట్స్  అందరిని పిలిచింది..

పిల్లలూ, ఒక్కొక్కరూ ఒక్కొక్క బెలూన్ తీసుకోండి అంది టీచర్..

టీచర్ చెప్పినట్టే బెలూన్స్ తీసుకున్నారు పిల్లలు..

ఇప్పుడు వాటిపైన మీ పేర్లు రాయండి అని మళ్లీ టీచరే చెప్పింది..

పేర్లు రాసాకా వాటిని అందరూ ఒకేసారి ఎగరేయండి అని చెప్పింది..అందరూ వారి వారి పేర్లు రాసి పైకి ఎగరేశారు..బెలూన్స్ అన్ని క్లాస్ ఆవరణలో పడ్డాయి.. టీచర్ వెళ్లి వాటన్నింటిని కలిపేసింది..

ఇప్పుడు మీరు వెళ్లి ఎవరి పేరున్న  బెలూన్ వాళ్ళు తీసుకుని రండి, మీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను  అని చెప్పింది టీచర్.

పిల్లలందరూ పరుగున వెళ్లారు, బెలూన్స్ లో వారి పేరున్న బెలూన్స్ కోసం వెతికారు..టీచర్ ఇచ్చిన టైం అయిపోయింది..కానీ బెలూన్ ని  వెతికి పట్టుకోలేకపోయారు.

ఈసారి మళ్లీ టీచర్ చెప్పింది.. “ఈ సారి ఒక్కొక్కరూ ఒక్కో బెలూన్స్ తీసుకుని అది ఎవరిదో వారికి ఇచ్చేయండి అని చెప్పింది” పిల్లలు టీచర్ చెప్పినట్టే చేశారు..రెండు నిమిషాల్లో ఎవరి బెలూన్ వారి దగ్గర ఉంది..

అప్పుడు టీచర్ అంది “ఈ బెలూన్స్ అనేవి మన హ్యాపీనెస్ లాంటివి, ఎవరూ కూడా వారి వారి సంతోషాన్ని వెతుక్కోలేరు..కానీ ప్రతి ఒక్కరూ వారి పక్కవారి పట్ల కేరింగ్ గా ఉన్నారంటే, వారికి ప్రేమ పంచారంటే రెట్టింపు సంతోషం మీ సొంతమవుతోంది..దాని కోసం మీరు ఖర్చు చేయాల్సింది కూడా ఏం ఉండదు.. ప్రేమ పంచడమే అని చెప్పింది.. పిల్లలందరూ సంతోషంతో కేరింతలు కొట్టారు..

ప్రస్తుత కరోనా కాలంకి ఈ కథ సరిగ్గా సరిపోతుంది.. ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడుతుంటే, మరికొందరు ఆకలితో పోరాటం చేస్తున్నారు..కష్టకాలంలో మనిషిలోని మానవత్వం బయటపడుతుంది. చాలామంది వారికున్నది మరికొంతమందితో శేర్ చేస్కుంటున్నారు..కొన్ని స్వచ్చంద సంస్థలు, కొందరు వ్యక్తులు వారి వారి స్థాయిలో కొంతమందికి సాయం చేస్తున్నారు. దాని వలన పక్కవాడి ఆకలి, బాధ తీర్చామనే సంతోషం… అందుకే అన్నారు శేరింగ్ ఈజ్ కేరింగ్ అని…


End of Article

You may also like