పాఠాలు నేర్పాల్సిన స్టూడెంట్ తో ఈ టీచర్ ఎంత పని చేసిందో చూడండి.. రోజులు ఇలా తయారయ్యాయేంటో….?

పాఠాలు నేర్పాల్సిన స్టూడెంట్ తో ఈ టీచర్ ఎంత పని చేసిందో చూడండి.. రోజులు ఇలా తయారయ్యాయేంటో….?

by Anudeep

Ads

ప్రస్తుతం రోజులు అస్సలు బాలేవు అనడానికి నిదర్శనంగా రోజుకో సంఘటన చోటు చేసుకుంటూనే ఉంటోంది. తాజాగా జరిగిన ఈ సంఘటన కూడా అందుకు ఉదాహరణే. ఈ ఫొటోలోని మహిళా టీచర్ గా పని చేస్తోంది. పాఠాలు చెప్పాల్సిన ఈ టీచర్ స్టూడెంట్ పై ప్రేమని ఒలకబోసింది.

Video Advertisement

మాయమాటలు చెప్పి ఆ స్టూడెంట్ ని ఏకంగా పెళ్లి చేసేసుకుంది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుచిరాపల్లి జిల్లా తురాయూర్ కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ లో ఈమె టీచర్ గా పని చేస్తోంది.

teacher

అదే స్కూల్ లో 11వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ మార్చి 5 వ తేదీన ఆదుకోవడం కోసం అని వెళ్లి తిరిగి రాలేదు. దీనితో పేరెంట్స్ కంగారు పడ్డారు. పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసును నమోదు చేసారు. ఈ క్రమంలో పోలీసులు ఆ ప్రైవేట్ స్కూల్ కు వెళ్లి ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఈ క్రమంలో అదే పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న, 26 సంవత్సరాల వయసు ఉన్న షర్మిల కూడా కనిపించడం లేదన్న విషయం పోలిసుల నోటీసుకు వచ్చింది.

teacher 1

అయితే పోలీసులు షర్మిల ఇంటికి వెళ్లి విచారించగా.. ఆమె గత కొన్ని రోజులుగా ఓ స్టూడెంట్ తో ఫోన్ లో మాట్లాడుతోందని.. తప్పని చెప్పినా వినడం లేదని ఆమె పేరెంట్స్ తెలిపారు. దీనితో.. పోలీసులు షర్మిల ఫోన్ ను ట్రేస్ చేసారు. ఆమె తిరుచిరాపల్లి జిల్లాలోని ఎడమలపట్టి పుత్తూర్​లో ఉన్నట్లు తెలియడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆమె తన స్నేహితురాలితో ఇంట్లో స్టూడెంట్ తో కలిసి ఉండగా పట్టుకున్నారు. స్టూడెంట్ ను అతని పేరెంట్స్ కు అప్ప చెప్పారు. ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేసారు. ఆ తరువాత మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లి, విచారణ జరిపిన తరువాత రిమాండ్ కు తరలించారు.


End of Article

You may also like