Ads
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.
ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడింది. తర్వాత సినిమా మార్చ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాలోని ఎత్తర జెండా పాట వీడియో కొంతకాలం క్రితం విడుదల చేశారు.ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఆలియా భట్ కూడా కనిపించారు. అయితే ఈ పాటపై ఇటీవల ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌కి సినిమా బృందం కూడా సెటైరికల్ గానే రిప్లై ఇచ్చారు. పాటలో చాలా చోట్ల కోడే అన్న పదం వస్తుంది.
దానిపై కామెంట్ చేస్తూ,”కోడి ఏంట్రా?” అని అడిగారు. సాధారణంగా కూడా పదం విన్న అందరికీ కోడి అనే అనిపిస్తుంది. కానీ దాని అర్థం అది కాదు అంటూ సినిమా బృందం రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్‌కి ఆర్ఆర్ఆర్ సినిమా బృందం, “కోడె అది. కోడె గిత్తలు లాగ అని. పాట మొదట్లో వచ్చే డైరెక్టర్ గారి వాయిస్ ఓవర్ ఒకసారి వినండి :)” అని రిప్లై ఇచ్చారు. ఇది మాత్రమే కాదు అంతకు ముందు కూడా ఇలాంటి చాలా ప్రశ్నలకు ఈ సినిమా బృందం ఇలాగే రిప్లై ఇచ్చారు.
End of Article