కరోనా టీకాను మనం ఎన్నో ఏళ్ల నుండి వాడుతున్నాము..! అదేంటో తెలుసా?

కరోనా టీకాను మనం ఎన్నో ఏళ్ల నుండి వాడుతున్నాము..! అదేంటో తెలుసా?

by Anudeep

Ads

ఏదైనా వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఖచ్చితంగా ఐదారేళ్ల పడుతుంది..ఇప్పుడు అత్యవసరం కాబట్టి  వ్యాక్సిన్ కనిపెట్టే పనులు ఎంత ఫాస్ట్ గా జరిగినా కూడా రెండేళ్లు ఖచ్చితంగా పడుతోంది. అయినా  ఇంతకుముందు  వచ్చిన వైరస్లన్నింటికి మందులున్నాయా. జలుబు, తలనొప్పి ఇవన్ని కూడా వైరస్ల వలన వచ్చేవే , వాటికి మందులెక్కడివి, ఉపశమనాలు తప్ప..కాబట్టి మనం ఎంతగా ఇమ్యునిటిని పెంచుకుంటే వైరస్లతో అంత ఫైట్ చేయగలం..

Video Advertisement

నిజమే వైరస్ల దాడికి సంబంధించి సరైన మందులు లేవు , కరోనా వైరస్ కి కూడా వ్యాక్సిన్ వస్తుందో రాదో డౌటే.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనాకి ఒక్కో దేశం ఒక్కో మందుని వాడుతోంది . వాటి ద్వారా వచ్చే రిజల్ట్స్ ని ఇతర దేశాలు శేర్ చేసుకుంటున్నాయి. మలేరియాకి వాడే మందులతో పాటు, హెచ్ఐవీ మందులని కూడా వాడి ఫలితాలను పొందుతున్నరు. కాని బిసిజి టీకా సరైన మందు అనే ఆశావహ థృక్పతం కనిపిస్తున్నది.

మన దగ్గర చిన్నపిల్లలకుపుట్టినప్పటి నుండే కొన్ని టీకాలు వేయిస్తుంటారు.. పది, పదిహేనేళ్లు వచ్చేవరకు రకరకాల టీకాలు వేయించడం తప్పనిసరి..అలాంటి టీకాల్లో ఒకటి బిసిజి. క్షయవ్యాధి(టిబి) నిర్యూలనకి ఈ టీకా వేస్తారు. అయితే కొన్ని దేశాల్లో బిసిజి టీకా అనేది తప్పనిసరి వాటిల్లో మన దేశం ఒకటి..కాని మరికొన్ని దేశాల్లో అవసరం అయితే తప్ప ఈ టీకా ఉపయోగించరు.

ఇప్పుడు పరిశోధనల్లో తేలుతున్న కొత్త విషయం ఏంటంటే బిసిజి టీకా వేయిస్తున్న దేశాల్లో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయి..వాడని దేశాల్లో కరోనా మరణాల శాతం ఎక్కువగా ఉంది. అంటే బిసిజి కరోనాని తగ్గిస్తుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం కాని ఇది పరిశోధనల్లో తేలిన విషయం. దాంతో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలుపెట్టాయి..

న్యూయార్క్ టెక్నాలజి ఇన్స్ట్ట్యూట్ వారి అధ్యయనం ప్రకారం బిసిజి వాడకం ఉన్న దేశాలు జపాన్, బ్రెజిల్ లలో కరోనా మరణాలు చాలా అంటే చాల తక్కువగా ఉన్నాయి. అక్కడ 30,40దశకాల నుండే  ఈ వాక్సిన్ వాడకంలో ఉంది. ఈ వాక్సిన్ వాడకాన్ని లేటుగా స్టార్ట్  చేసిన ఇరాన్ లో కరోనా మరణాల రేటు ఎక్కువ గా ఉంది.. టిబి నిర్యూలించేసాం అనుకున్న దేశాల్లో వాక్సిన్ వాడకం తగ్గిపోయింది..ఆయా దేశాల్లో కూడా ఇప్పుడు కరోనా విపరీతంగా వ్యాపించింది.

బిసిజి టీకాపైనే ప్రస్తుతం అన్ని ఆశలూ ఉన్నాయి. కాని మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది అని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వ్యాఖ్యానించారు. నిజానికి గతంలో వచ్చిన భయంకరమైన వైరస్ సార్స్ ని ఎదురించడానికి ఉపయోగపడింది బిసిజినే. సార్స్ కూడ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు కరోనాని అడ్డుకునేది కూడా బిసిజియే కాబోతోందా చూడాలి.


End of Article

You may also like