Ads
CM KCR TODAY: నేడు సీఎం కెసిఆర్ వాసాలమర్రిలో పర్యటన ! తెలంగా సీఎం కెసిఆర్ ఇవాళ తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో 42 రోజుల తరువాత మరోసారి పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పోలీసు శాఖ వారు పటిష్ట బందోబస్తు చేసారు.
Video Advertisement

cm kcr today
రోడ్డు మార్గం లో ఉదయం 11 గంటలకి సీఎం కెసిఆర్ అక్కడికి చేరుకోనున్నారు. పల్లె బాట కార్యక్రమం లో భాగంగా మొదట దళిత వాడల్లో పర్యటిస్తారు. అనంతరం పారిశుధ్య పనులు గురించి తెలుసుకుంటారు. అనంతరం సర్పంచి ఇంట్లో భోజన విరామం అనంతరం రైతు వేదిక భవనాల్లో సీఎం ప్రసంగించనున్నారు.ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత అధికారులు అక్కడ ఉన్న వసతుల పై ద్రుష్టి సారించారు. సీఎం పర్యటనతో అక్కడి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనింది.
End of Article
