తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 199కేసులు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 199కేసులు.

by Anudeep

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 199కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. . వీరిలో 196మంది  తెలంగాణ రాష్ట్రవాసులు కాగా… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. నమోదైన 199 కేసుల్లో 122 కేసులు GHMC పరిధిలో నమోదుకాగా, రంగారెడ్డిలో 40, మహబూబ్ నగర్ లో 3, మేడ్చల్ 10, ఖమ్మంలో 9, సూర్యాపేట 1, నిర్మల్ 1, వరంగల్ అర్బన్ 2, యాదాద్రి 1, జగిత్యాల 3, మెదక్ 3, జనగాంలో 1, వలస కూలీల్లో 3 కేసులు నమోదయ్యాయి.

Video Advertisement

తెలంగాణలో మొత్తం  కేసుల సంఖ్య 2,698కి చేరింది. ఇందులో 1428 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 1188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బారిన పడి 82 మంది చనిపోయారు.ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.


You may also like