Ads
తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఎన్నికల పూర్తవగానే పలు సంస్థలు తాము నిర్వహించిన సర్వేల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. డిసెంబర్ మూడో తారీఖున జరిగే ఎన్నికల కౌంటింగ్ లో వచ్చే రిజల్ట్స్ తమ సర్వేల కు దగ్గరగా ఉంటాయని చెబుతున్నాయి. అయితే ఒకటి రెండు సర్వేలు తప్ప మిగతావన్నీ కూడా కాంగ్రెస్ కి మెజారిటీ వస్తుందని చెప్పాయి.
Video Advertisement
తెలంగా ఎన్నికలపై ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో ఏకంగా 63 నుంచి 79 స్థానాలతో హస్తం పార్టీ జెండా ఎగురవేస్తుందని తేల్చింది. బీఆర్ఎస్- 31 నుంచి 47 స్థానాలకే పరిమితమౌతుందని అభిప్రాయపడింది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గగనమేనని స్పష్టం చేసింది.
అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి అంటూ ఇప్పటినుంచి విశ్లేషణ మొదలు పెడుతున్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం.. బీఆర్ఎస్ ఓటమికి దారి తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయితే బీఆర్ఎస్ ఓడిపోవడమేంటీ?, ఏపీ రాజకీయాలు తెలంగాణను ప్రభావితం చేశాయా? అనే ప్రశ్నలకూ సమాధానాలు ఉన్నాయి.
లక్షలాది మంది ఏపీ ఓటర్లు తెలంగాణలో నివసిస్తోన్నారు. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో వారి సంఖ్య అధికం. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయగలిగే సంఖ్యలో ఉన్నారు.చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్‌కు చెందిన కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు వారిలో ఆగ్రహాన్ని కలిగించాయని చెబుతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత దీనికి కారణమని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు.
కానీ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పని చేశారన్నది బహిరంగ విషయమే. దానికి కారణం ఒకప్పుడు టిడిపిలో పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండడం. రేవంత్ పై ఉన్న అభిమానం తెలుగుదేశం ఓట్లన్నీ కాంగ్రెస్ కి పడేలా చేశాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సర్వేలు నిజమా కాదా అని తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వెయిట్ చేయాలి.
Also Read:బర్రెలక్క భవిష్యత్తు గురించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి.? ఎన్ని ఓట్లు రావచ్చు.?
End of Article