తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు….అందరూ పాస్….పూర్తి వివరాలు ఇవే

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు….అందరూ పాస్….పూర్తి వివరాలు ఇవే

by Anudeep

Ads

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు  కీలక నిర్ణయం తీసుకున్నారు.పదవ తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. .విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

Video Advertisement

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా  5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు  ప్రమోట్‌ చేయాలని  నిర్ణయించింది.  ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితిల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే  ఇంటర్నల్‌, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.


End of Article

You may also like