జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులను అందరూ దైవంతో పోలుస్తూ ఉంటారు. కంటికి కనిపించే దేవుళ్లు తల్లిదండ్రులే అని చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వాటిని నిజం చేసి చూపిస్తున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లల బాగోగుల కోసం, మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూ ఉంటారు. పిల్లల జీవితం గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చేందుకు చెమటోడుస్తూ ఉంటారు.

Video Advertisement

 

 

అయితే ప్రస్తుత కాలం లో తల్లిదండ్రుల పట్ల కొంత మంది పిల్లలు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెల మధ్య బంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తులు,అంతస్థులివ్వలేదని, నగలివ్వలేదని తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గోరు ముద్దలు కొసరి కొసరి తినిపించిన తల్లిదండ్రులకు, వారు మలిదశకు వచ్చే సరికి అన్నం పెట్టడం లేదు. మానవ సంబంధాలను మరచి నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు.

telangana men made statues of their parents..!!

అయితే కొందరు పిల్లలు మాత్రం తమ తల్లిదండ్రుల విలువను తెలుసుకొని.. మలి దశలో వారికి అండగా నిలుస్తుంటారు. బ్రతికుండగానే కాదూ చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమను పలు రూపాల్లో చాటుకుంటారు. అటువంటి ఘటనే తాజాగా వరంగల్ లోని హన్మకొండ లో జరిగింది. తెలంగాణ హన్మకొండ జిల్లాలోని కాజీపేట మండలంలో. దర్గాకాజీ పేట గ్రామానికి చెందిన ఎల్లయ్య, రాధమ్మ దంపతులు. వారికి ముగ్గురు కుమారులు శ్రీనివాసులు, గౌరీశంకర్, రాధా కృష్ణ.

telangana men made statues of their parents..!!

అయితే గతేడాది ఎల్లయ్య, రాధమ్మ దంపతులు మరణించారు. కొద్ది రోజుల తేడాతో వారిద్దరూ మరణించడం తో వారి ముగ్గురి కుమారులు వారి ప్రేమను చాటుకున్నారు. వారి సంవత్సరీకం సందర్భంగా చనిపోయిన తల్లిదండ్రులను నిత్యం స్మరించుకునేలా ఓ ఆలోచన చేశారు. తల్లిదండ్రులకు విగ్రహాలు చేయించి, ఇంటి దగ్గర ఏర్పాటు చేసి వారి విగ్రహాలకు పూజలు చేశారు.అంతేకాదు ఈ విగ్రహాలను పూజ గదిలో పెట్టుకుని పూజిస్తామని ముగ్గురు కుమారులు చెబుతున్నారు. తల్లిదండ్రులపై ప్రేమను చాటుకున్న ముగ్గురు కుమారులను బంధువులు, స్థానికులు అభినందిస్తున్నారు.