Ads
తెలంగాణలో ఎన్నికల హడావిడి రసవత్తరంగా ఉంది. ప్రధాని పార్టీలన్ని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓకే ఎలక్షన్ టైం దగ్గర పడిపోవడంతో ప్రచారం గడువు కూడా ముగియనుంది. అయితే ఈసారి ఎన్నికలు చాలా టఫ్ గా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవచ్చు అని అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున పలువురు అభ్యర్దులు చాలా మందికి అసలు పేరు కంటే కొసరు పేరుతోనే పరిచయం అయ్యి ఉంటారు.
Video Advertisement
అందుకే ప్రజలు ఈ కొసరు పేరు తోనే ఈ అభ్యర్ధులను గుర్తు పడతారు.నామినేషన్ పత్రల్లో కూడా అసలు పేరు పక్కన ఈ కొసరు పేరు చేర్చుతారు.
1.పోచారం శ్రీనివాస్ రెడ్డి:
బాన్సువాడ BRS ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అసలు పేరు పరిగె శ్రీనివాస రెడ్డి.ఈయన స్వగ్రామం బాన్సువాడ మండలం పోచారం కావడంతో అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.
2.రసమయి బాలకిషన్:
రసమయి బాలకిషన్ గా ప్రాచుర్యం పొందిన మానకొండూరు BRS అభ్యర్థి అసలు పేరు ఇరుపుల బాల కిషన్, రసమయి అనే సంస్కృతిక సంస్థను స్థాపించడంతో అదే ఆయన ఇంటి పేరు అయిపోయింది.
3.పద్మాదేవేందర్ రెడ్డి:
మెదక్ BRS అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అసలు పేరు
మాధవ రెడ్డి గారి పద్మ. ఆమె తన భర్త పేరు కలుపుకోవడంతో అది ప్రాచుర్యంలో వచ్చింది.
4.సీతక్క:
ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క అసలు పేరు దనసరి అనసూయ. ఆమె నక్సలిజమ్ లో ఉన్నప్పటి నుండి సీతక్కగా ప్రాచుర్యం పొందారు.
5.బండారు శ్రావణి:
జగిత్యాల బిజెపి అభ్యర్థి నామినేషన్ లో బండారు శ్రావణి గా నమోదు చేశారు వ్యవహారికంగా ఆమెను అత్తగారి ఇంటి పేరుతో బోగ శ్రావణి గా పిలుస్తారు.
ఇలా చాలామంది నాయకులు అసలు పేరు కంటే కొసరు పేరుతోనే ప్రాచుర్యం పొంది రాజకీయాల్లో రాణిస్తున్నారు..
7.మధు యాష్కీ గౌడ్ :
ఎల్బి నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ గౌడ్ అసలు పేరు మధుసూధన్….ఆయన అసలు పేరు కంటే కూడా…కొసరు పేరుతోనే బాగా ప్రాచుర్యం పొందారు.కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ కూడా…
Also Read:లోకల్ బాయ్ నాని దోషి కాదా..? నానికి జనసేన పార్టీకి సంబంధం ఉందా..?
End of Article