Ads
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బాధ్యతలు చేపట్టింది సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు . అయితే అప్పుడు మంత్రులకు ఏ శాఖ అనేది కేటాయించలేదు. తాజాగా మంత్రులకు శాఖలను ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ దృష్టి కూడా ఐటీ శాఖ పై పడింది. ఈ శాఖ ఎవరికిస్తారా అంటూ యువత ఎదురుచూశారు. అయితే ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే ఐటీ శాఖను దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు కేటాయించారు.
Video Advertisement
అయితే ఐటి మినిస్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కేటీఆర్. టిఆర్ఎస్ హయాంలో హైదరాబాదుని ఐటీ శాఖ పరంగా డెవలప్ చేయడం లో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. పలు మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాదులో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి అంటే దాని వెనక ఉన్నది కేటీఆర్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఐటి మినిస్టర్ ఎవరు వచ్చినా సరే కేటీఆర్ ను దాటుకుని పని చేయగలరా అంటూ ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు ఆ శాఖను శ్రీధర్ బాబుకు కేటాయించారు. గతంలో శ్రీధర్ బాబుకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా కూడా ఐటీ మంత్రిగా అనుభవం లేదు.
ఒకసారి శ్రీధర్ బాబు ప్రస్థనాన్ని చూసుకుంటే మంథని నియోజకవర్గం నుండి 1999 నుంచి 2009 వరకు వరుసగా మూడుసార్లు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ గెలవగా, 2018 ఎన్నికల్లో శ్రీధర్‌బాబు గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి శ్రీదర్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
ప్రముఖ కాంగ్రెస్ నేత శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు, జయమ్మలకు 1969 మార్చి 30న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. అయితే తండ్రి శ్రీపాద రావు మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు శ్రీధర్ బాబు. రాజకీయ వారసునిగా పాలిటిక్స్ లోకి అడుగుపెట్టి 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టారు.
ఇక శ్రీధర్‌బాబు గురించి మరో ఆసక్తికర విషయం ఉంది. విద్యార్థి దశ నుండి ఆయన మంచి క్రికెట్ ప్లేయర్ . శ్రీధర్‌బాబు నిజాం కళాశాల, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించారు.ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి శైలాజా రామయ్యర్‌తో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.ఏ పదవిలో ఉన్నా తన పనితీరుతో ఆ పొజిషన్‌కు న్యాయం చేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీధర్‌బాబు ఐటీ శాఖ మంత్రిగా తన మార్క్ చూపించాలని తెలంగాణ ప్రజలు, ఐటీ ఉద్యోగులు, యువత అభినందనలు తెలియజేస్తున్నారు.
End of Article