Ads
టెలివిజన్ లో ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రీవాణి అందరికీ తెలిసిందే.. శ్రీవాణి సీరియల్స్ తో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
Video Advertisement
నిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గలగల మాట్లాడుతూ ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకొనే శ్రీవాణి గొంతు ఒక్కసారిగా మూగబోయినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని వీడియోలలో ఆమె గొంతులో మార్పులు వచ్చిన విషయం మనకు తెలిసిందే. మొదట జలుబు అని భావించారంతా. అయితే ఆమె గొంతు విన్న చాలామంది తన గొంతు గురించి కామెంట్లు కూడా చేశారు.
అయితే తనకు పూర్తిగా మాట రాకపోవడంతో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళితే రిపోర్ట్స్ చూసిన అనంతరం శ్రీవాణి భర్త మాట్లాడుతూ ఎప్పుడు గలగల మాట్లాడే శ్రీవాణి గొంతు విషయంలో కాస్త సీరియస్ గా ఉందని తెలిపారు. అయితే ఆమె షూటింగ్ సమయంలో ఎక్కువ గట్టిగా మాట్లాడటం వల్ల ఒత్తిడికి గురవడంతో తన గొంతు లోపల ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.
ఒక నెల రోజులు శ్రీవాణి మాట్లాడకుండా ఉంటేనే తనకు తిరిగి మాట వస్తుందని లేకపోతే తనకు జీవితంలో మాట రాదని డాక్టర్లు చెప్పినట్లు శ్రీవాణి భర్త విక్రమ్ వెల్లడించారు. అయితే శ్రీ వాణికి తొందరగానే నయమవుతుందని భావిస్తున్నాను మా కోసం మీరు కూడా ప్రార్థించండి అంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె తొందరలోనే మామూలు మనిషి కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.
watch video :
https://telugustop.com/television-actress-srivanis-voice-is-silent-didnt-she-speak-anymore
End of Article