ఈ 11 మంది తెలుగు యాంకర్ల భర్తలు ఎవరో తెలుసా.? వాళ్లేం చేస్తారు అంటే.?

ఈ 11 మంది తెలుగు యాంకర్ల భర్తలు ఎవరో తెలుసా.? వాళ్లేం చేస్తారు అంటే.?

by Mohana Priya

Ads

ప్రతి రోజు టీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్ తో మనని అలరిస్తూ ఉంటారు యాంకర్స్. అలా ఎన్నో సంవత్సరాల నుండి మనల్ని అలరిస్తూ మనలో ఒకరిగా కలిసిపోయారు. యాంకర్స్ కి సంబంధించిన విషయాలు అయితే మనందరికీ తెలుసు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు కొంత మందికి తెలిసి ఉండొచ్చు కొంత మందికి తెలియకపోయి ఉండొచ్చు. అలా టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాంకర్స్ భర్తలు ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

#1 అనసూయ

జబర్దస్త్ షో ద్వారా మనందరినీ అలరిస్తున్నారు అనసూయ. అనసూయది ప్రేమ వివాహం. అనసూయ భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. సుశాంక్ బీహార్ కి చెందిన వారు. ఆయన ఒక వ్యాపారి.

#2 ఉదయభాను

ఒకప్పుడు టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకొని మధ్యలో కొంతకాలం విరామం తీసుకొని మళ్లీ ఇప్పుడు తన జర్నీని కొనసాగిస్తున్న ఉదయభాను భర్త పేరు విజయ్. విజయ్ ఒక బిల్డర్.

#3 ఝాన్సీ

ఎలాంటి స్టైల్ లో అయినా సరే ఈజీగా మాట్లాడేస్తారు ఝాన్సీ. మల్లేశం, తులసి సినిమాలో కోకాపేట కనకం పాత్ర ఇవే కాకుండా ఇంకా ఎన్నో సినిమాల్లో ఎన్నో డిఫరెంట్ పాత్రలు పోషించారు ఝాన్సీ. అలాగే యాంకరింగ్ రంగంలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఝాన్సీ, నటులు జోగి బ్రదర్స్ లో ఒకరైన జోగి నాయుడు ని పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు.

#4 సుమ

టీవీలో బెస్ట్ యాంకర్ ఎవరు అని అడిగితే అందరూ ఏకగ్రీవంగా చెప్పే పేరు సుమ. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ప్రోగ్రామ్స్ లో అదే ఎనర్జీ తో మన అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు సుమ. రాజీవ్ కూడా ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

#5 గాయత్రి భార్గవి

యాంకర్ గానే కాకుండా, యాక్టర్ గా కూడా మనల్ని అలరిస్తున్నారు గాయత్రి భార్గవి. అంతే కాకుండా ఇటీవల వచ్చిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో హీరోకి సహాయం చేసే రిపోర్టర్ గా నటించిన వినోదిని వైద్యనాథన్ కి తెలుగులో గాయత్రి భార్గవి డబ్బింగ్ చెప్పారు. గాయత్రి భార్గవి భర్త పేరు విక్రమ్. విక్రమ్ ఒక ఆర్మీ అధికారి.

#6 శిల్పా చక్రవర్తి

ఎన్నో సంవత్సరాల నుండి యాంకరింగ్ చేస్తూ, అలాగే నటిస్తూ, అంతే కాకుండా ఇటీవల బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా పాల్గొన్న శిల్పా చక్రవర్తి భర్త పేరు కళ్యాణ్.

#7 శ్యామల

శ్యామల కూడా అటు యాంకరింగ్ తో పాటు, ఇటు యాక్టింగ్ కూడా చేస్తున్నారు. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనల్ని అలరిస్తున్నారు. శ్యామల భర్త నరసింహ. నరసింహ కూడా ఎన్నో సీరియల్స్ లో నటించారు.

#8 ప్రవీణ కడియాల

ప్రవీణ యాంకరింగ్, యాక్టింగ్ మాత్రమే కాకుండా ప్రొడక్షన్ కూడా చేసుకుంటున్నారు. ప్రవీణ భర్త అనిల్. వీరిద్దరూ జ్ఞాపిక ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో షోస్ కూడా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా కార్తికేయ హీరోగా నటించిన గుణ 369 సినిమాని కూడా నిర్మించారు.

#9 లాస్య

ఎన్నో షోస్ కి యాంకరింగ్ చేసి, సినిమాల్లో నటించి, అలాగే బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా పాల్గొన్న లాస్య భర్త పేరు మంజునాథ్. మంజునాథ్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

#10 వింధ్య విశాఖ

ఐపీఎల్ తెలుగు ద్వారా, ప్రస్తుతం ఈ టీవీలో వచ్చే నువ్వు రెడీ నేను రెడీ షో ద్వారా మనల్ని అలరిస్తున్న వింధ్య, 2019 లో విశాల్ ని పెళ్లి చేసుకున్నారు.

#11 మృదుల అయ్యంగార్

యాంకర్ మృదుల భర్త పేరు కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య ప్రముఖ సింగర్. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, లీడర్, ఓకే బంగారం తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు కృష్ణ చైతన్య.


End of Article

You may also like