Ads
దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయిన కార్తి జపాన్, లారెన్స్ జిగర్‌తాండ డబుల్ ఎక్స్ చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు భాషల్లో పండుగకు రిలీజైన సినిమాల్లో ఇవే భారీ బడ్జెట్ మూవీస్ కావడం గమనార్హం. జపాన్ సినిమాకు రాజ్ మురుగన్ డైరెక్టర్.జిగర్ తాండ సీక్వెల్‌కు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు.
Video Advertisement
భారీ అంచనాలతో రిలీజైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.తెలుగులో విడుదలైన చిత్రాలు కంటే ఈ డబ్బింగ్ చిత్రాలకి రిలీజ్ ముందు ఎక్కువ క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్ నిలబెట్టుకోవడంలో ఈ రెండు చిత్రాలు ఫెయిల్ అయ్యాయి.
కార్తి జపాన్ చిత్రం అయితే మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 15 కోట్లకు పైగా గ్రాస్, ఏడున్నర కోట్లకు వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ మూవీ ఇప్పటివరకు మూడున్నర కోట్ల వరకు గ్రాస్‌ను, కోటి డెబ్బై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సినీ ట్రేడ్ వర్గాల సమాచారం.తొలిరోజు జపాన్ మూవీకి కోటికిపైగా కలెక్షన్స్ వచ్చాయి. అయితే నెగెటివ్ టాక్ కారణంగా మూడో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆదివారం ఈ సినిమా 35 లక్షల వరకు మాత్రమే వసూళ్లు రావడం చూస్తే తెలుస్తుంది ఇది ఏ రేంజ్ డిజాస్టర్ అనేది. జపాన్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది.లారెన్స్, ఎస్‌జేసూర్య హీరోలుగా నటించిన జిగర్‌తాండ డబుల్ ఎక్స్ తెలుగులో పూర్తిగా నిరాశ పరిచింది. లారెన్స్ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.
మూడు రోజుల్లో ఈ మూవీకి రెండు కోట్ల నలభై లక్షల వరకు గ్రాస్, కోటి ఇరవై లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడో రోజు ఈ సినిమా 50 లక్షల వరకు వసూళ్లు దక్కించుకున్నట్లు తెలిసింది. తెలుగులో కార్తి జపాన్ కంటే జిగర్ తాండ ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. జపాన్ నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజవ్వగా…జిగర్ తాండ డబుల్ ఎక్స్ ఐదున్నర కోట్ల వరకు ప్రీ రిలీజ్ చేసింది. కలెక్షన్స్ చూస్తుంటే రెండు సినిమాలు తెలుగులో బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే కనిపిస్తోంది. బయ్యర్స్ కు నష్టాలు తప్పేలాగా లేదు.
Also Read:నాని నెక్స్ట్ సినిమాలో విలన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!
End of Article