Ads
మన ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నారు. అయితే మన దర్శకులలో కొంత మంది ఇతర భాషల్లో కూడా సినిమాలను డైరెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరో, వాళ్ళు డైరెక్ట్ చేసిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 క్రిష్ జాగర్లమూడి
వేదం, గమ్యం, కంచె వంటి ఎన్నో మంచి సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి హిందీలో గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాని డైరెక్ట్ చేశారు.ఈ సినిమా ఠాగూర్ సినిమా రీమేక్.
అలాగే వేదం తమిళ్ రీమేక్ అయిన వానం ని కూడా డైరెక్ట్ చేశారు.
#2 పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్ కూడా కన్నడలో అప్పు,
అలాగే హిందీలో షర్త్ ద ఛాలెంజ్,
బుడ్డా హోగా తేరా బాప్ సినిమాలను డైరెక్ట్ చేశారు.
#3 మెహర్ రమేష్
మెహర్ రమేష్ ఒక్కడు కన్నడ రీమేక్ అయిన అజయ్ ని డైరెక్ట్ చేశారు.
#4 గౌతమ్ తిన్ననూరి
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెలుగులో వచ్చిన జెర్సీ సినిమాకి హిందీలో కూడా గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
#5 విక్రమ్ కే కుమార్
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా 13B హిందీలో కూడా షూట్ అయ్యింది.
#6 కె. రాఘవేంద్ర రావు
కె.రాఘవేంద్ర రావు గారు ఫర్జ్ ఔర్ కానూన్, హిమ్మత్ వాలా, జానీ దోస్త్ తో పాటు ఇంకా కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు.
#7 కోదండరామి రెడ్డి
కోదండరామి రెడ్డి గారు అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమా హిందీ రీమేక్ అయిన జమాయి రాజా ని డైరెక్ట్ చేశారు.
#8 దేవ కట్టా
దేవ కట్టా ప్రస్థానం సినిమాని హిందీలో కూడా డైరెక్ట్ చేశారు.
#9 గౌతమ్ మీనన్
గౌతమ్ మీనన్ ఏ మాయ చేసావే హిందీ రీమేక్ అయిన ఏక్ దివానా థా ని డైరెక్ట్ చేశారు.
#10 మురుగదాస్
మురుగదాస్ గజిని హిందీ రీమేక్ అయిన గజిని,
అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన తుపాకి రీమేక్ హాలిడే,
సోనాక్షి సిన్హా హీరోయిన్ గా మౌన గురు హిందీ రీమేక్ అయిన అకీరా సినిమాని డైరెక్ట్ చేశారు.
#11 సందీప్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా, కబీర్ సింగ్ సినిమా డైరెక్ట్ చేశారు అలాగే రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న అనిమల్ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తున్నారు.
#12 వివి వినాయక్
వివి వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డెబ్యూట్ అయిన చత్రపతి రీమేక్ డైరెక్ట్ చేయబోతున్నారు.
#13 రాంగోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ హిందీలో ఎన్నో సినిమాలు రూపొందించారు.
#14 కృష్ణవంశీ
కృష్ణవంశీ అంతపురం రీమేక్ అయిన శక్తి సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సౌందర్య గారి పాత్రలో కరిష్మా కపూర్ నటించారు.
End of Article