Ads
సినిమా ఫిల్డ్‌లో వారసుల విషయానికి వస్తే హీరోల కొడుకులు హీరోలుగా పరిచయమైన వాళ్ల సంఖ్యే ఎక్కువ. కాని హీరోల కూతుళ్లు హీరోయిన్‌లుగా పరిచయం అయిన వాళ్లు తక్కువనే చెప్పాలి.
Video Advertisement
పెద్ద బాక్గ్రౌండ్ ఉన్న హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. హీరోయిన్ అవ్వాలంటే అందం ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా కావాలి. కానీ అందం, అభినయం, అదృష్టం ఉండి కూడా హీరోయిన్లు గా రాణించలేకపోయారు కొందరు. ఇప్పుడు వారెవరో తెలుసుకుందాం..
#1 సుప్రియ యార్లగడ్డ
అక్కినేని నాగేశ్వర రావు గారి మనవరాలు, నాగార్జున మేనకోడలు సుప్రియ. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం తో హీరోయిన్ గా తెరకు పరిచయమయ్యారు సుప్రియ. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు రాలేదు. తర్వాత ఆమె నిర్మాతగా మారారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత గూఢచారి చిత్రం లో నటించారు.
#2 మంచు లక్ష్మి ప్రసన్న
మంచు మోహన్ బాబు కుమార్తె గా మంచు లక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈమె హీరోయిన్ గా కాకుండా.. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ సాగుతోంది కానీ పూర్తి స్థాయి లో పాత్రలు చేయలేకపోతోంది. ఈమె నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.
#3 మంజుల ఘట్టమనేని
కృష్ణ రెండో కుమార్తె మంజుల ప్రధాన పాత్రలో ఒకటి రెండు చిత్రాలు వచ్చినా.. కృష్ణ ప్రేక్షకులు దీనికి ఒప్పుకోకపోవడం తో ఆమె హీరోయిన్ గా చెయ్యలేదు.
#4 శృతి హాసన్
కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉంది.. కానీ కెరీర్ స్టార్టింగ్ లో ఆమెకు అన్ని ప్లాప్ లే..
#5 కొణిదెల నిహారిక
నాగబాబు కుమార్తె హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. దీంతో ఆమె నిర్మాతగా మారారు.
#6 అక్షర హాసన్
కమల్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు కానీ.. అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
#7 వరలక్ష్మి శరత్ కుమార్
నటుడు శరత్ కుమార్ ముద్దుల తనయ వరలక్ష్మి కూడా హీరోయిన్ గా సత్తా చాటాలని చూసిన కొన్ని సినిమాల తర్వాత ఎందుకో హీరోయిన్ గా రాణించలేకపోయింది.
#8 శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్
హీరో రాజశేఖర్ కుమార్తెలిద్దరు హీరోయిన్లు గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు . నటులుగా తమని తాము నిరూపించుకున్నారు కానీ వీరిద్దరికి ఇప్పటివరకు బ్రేక్ రాలేదు.
End of Article