Ads
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్న సంగతి తెలిసిందే. రష్యా దాడికి తెగబడడంతో ఉక్రెయిన్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడి ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు.
Video Advertisement
రష్యా అధ్యక్షుడు పశ్చిమ మరియు ఉక్రెయిన్ లు నాటోలో చేరబోమని మరియు ఉక్రెయిన్ సైనికరహితం చేసి తటస్థ రాజ్యంగా మారాలని హామీలు కోరుతున్నారు. ఈ విషయమై ఉక్రెయిన్ వెనక్కి తగ్గడంతో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్‌కి మంచి పర్యాటక స్థలం అని కూడా పేరుంది. ఉక్రెయిన్‌కి మన సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక సంబంధం ఉంది. ఎన్నో హిట్ సినిమాల్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, పాటలు ఉక్రెయిన్‌లో షూట్ చేసారు. ఆ సినిమాలు ఏవో, ఉక్రెయిన్‌లో షూట్ చేసిన ఆ సన్నివేశాలు, పాటలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 ఆర్ఆర్ఆర్
త్వరలో విడుదల అవ్వబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఉక్రెయిన్ ప్యాలెస్‌లో షూట్ చేసారు. అలాగే ఒక ముఖ్యమైన షెడ్యూల్ కూడా ఉక్రెయిన్‌లో షూట్ చేసారు.
#2 విన్నర్
సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన విన్నర్ సినిమాలోని ఒక పాట కూడా ఉక్రెయిన్‌లో షూట్ చేసారు.
#3 రోబో 2.0
రజినీకాంత్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రోబోకి సీక్వెల్‌గా వచ్చిన రోబో 2.0 సినిమాలోని ఒక పాట కూడా ఉక్రెయిన్‌లో షూట్ చేసారు. ఈ పాట విలన్ గా నటించిన అక్షయ్ కుమార్ పై షూట్ చేసారు.
#4 దేవ్
కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన దేవ్ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఉక్రెయిన్‌లో షూట్ చేసారు. ఈ సినిమాని దేవ్ పేరుతో తెలుగులోకి డబ్ చేసారు.
ఇవి మాత్రమే కాకుండా ఎన్నో భారతీయ సినిమాల్లోని సన్నివేశాలు, పాటలు ఉక్రెయిన్‌లో షూట్ చేశారు.
End of Article