Ads
మొదటిలో నెగిటివ్ టాక్ ను సంపాదించుకొని విజయాన్ని సంపాదించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. డైరెక్టర్లు తమ చేసిన సినిమాలు హిట్ అవుతాయని నమ్మకం తోనే సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ అవి నెగిటివ్ టాక్ తో వెనుతిరుగుతూ ఉంటాయి.
Video Advertisement
నెగిటివ్ టాక్ ను కూడా పాజిటివ్ గా మార్చుకొని విజయం సంపాదించుకుంటాయి నెగిటివ్ టాక్ తోనే భారీ కలెక్షన్లు సంపాదిస్తూ హిట్ టాక్ ను అందుకుంటాయి. ఇది కథ పరంగా కావచ్చు, నిర్మాతలు చేసే ప్రచారం వలన కావచ్చు. మరి అలా నెగిటివ్ టాక్ నుంచి హిట్ టాక్ ను సంపాదించుకొని మన టాలీవుడ్ సినిమాలు ఏమిటో చూసేద్దామని రండి.
#1 సరైనోడు :
50 కోట్ల బడ్జెట్ తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం మొదట నెగెటివ్ టాక్ అందుకున్నా బాక్సాఫీస్ వద్ద 127 కోట్ల కలెక్షన్ తో విజయం సాధించింది.
#2 నాన్నకు ప్రేమతో :
2016 సంక్రాంతి కానుకగా సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ఈ చిత్రంలో మొదట ఓవర్ ఇంటెలిజెన్స్ యాక్షన్ అని చెప్పి మొదట నెగెటివ్ టాక్ ను సంపాదించుకుంది. మెల్లమెల్లగా దర్శకుడు సుకుమార్ లాజిక్ అర్థమయ్యే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ను సాధించింది.
#3. ఇస్మార్ట్ శంకర్ :
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం తొలి రోజులలో నెగటివ్ టాక్ ను అందుకున్న నెమ్మదిగా సక్సెస్ సాధించి 18 కోట్ల లాభాలను సంపాదించింది.
#4. సన్ ఆఫ్ సత్యమూర్తి :
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి లో నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం కావడంతో మంచి విజయం సాధించింది.
#5. సోగ్గాడే చిన్నినాయన :
నాగార్జున లాంటి స్టార్ హీరోతో డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడించడం ఏంటి అని మొదటిలో విమర్శలు అందుకుంది సోగ్గాడే చిన్నినాయన చిత్రం. కానీ ఈ చిత్రంపై చివరికి మంచి కలెక్షన్లతో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.
#6.పుష్ప :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీకి మొదటి గాను ఆయన లుక్ పై నెగిటివ్ టాక్ వచ్చాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో విజయం సాధించింది.
#7. సర్కారు వారి పాట:
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఫస్ట్ హాఫ్ అదుర్స్ అంటూ, సెకండాఫ్ తగిన విధంగా లేదంటూ మొదటి లోని నెగటివ్ టాక్ సంపాదించుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రమోషన్స్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది.
End of Article