“వైవా హర్ష” లాగే… హీరోలుగా చేసి ఫెయిల్ అయిన 8 మంది స్టార్ కమెడియన్లు వీరే.!

“వైవా హర్ష” లాగే… హీరోలుగా చేసి ఫెయిల్ అయిన 8 మంది స్టార్ కమెడియన్లు వీరే.!

by kavitha

Ads

ఇండస్ట్రీలోకి వచ్చే నటులలో ఎక్కువ శాతం హీరోలు కావడానికే వస్తుంటారు. అయితే అందరికీ హీరోగా నటించే అవకాశం దొరకడం అంత ఈజీ కాదు. అందువల్ల వచ్చిన అవకాశాన్ని అయిన సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతుంటారు. మంచి గుర్తింపు, క్రేజ్ ను పొందిన తరువాత హీరోగా మారుతుంటారు.

Video Advertisement

అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, విలన్ గా చేసి ఆ తరువాత హీరోలు అయ్యి స్టార్స్ గా మారినవారు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. అయితే హాస్య నటులుగా స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత హీరోలుగా మారిన వారు చాలామంది ఉన్నారు. కానీ హీరోలుగా నిలదొక్కుకున్న వారు చాలా తక్కువ. స్టార్ కమెడియన్స్ గా రాణించి, హీరోలుగా ఫెయిల్ అయిన 10 మంది స్టార్ కమెడియన్లు  ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. కృష్ణ భగవాన్ :

ఒకప్పటి స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్ ‘జాన్ అప్పారావ్ 40+’ మూవీతో హీరోగా మారాడు. ఆ మూవీ తరువాత మరో  సినిమాలో కూడా హీరోగా చేశాడు. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో హీరోగా నిలబడలేకపోయాడు.

2. శ్రీనివాస్ రెడ్డి :

సీనియర్ నటుడు మరియు స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి జయమ్ము నిశ్చయంబురా, జంబ లకిడి పంబ లాంటి సినిమాలలో హీరోగా చేశాడు. కానీ అవి విజయం సాధించలేదు. దాంతో హీరోగా కొనసాగలేదు.

3.షకలక శంకర్ :

‘జబర్దస్త్’ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయిన షకలక శంకర్ పలు సినిమాల్లో కమెడియన్ గా చేశాడు. ఆ తర్వాత హీరోగా శంభో శంకర, నేనే కేడీ నెంబర్ 1 లాంటి సినిమాలు చేశాడు. అవి ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం అంతగా ఛాన్సులు లేవు.

4. ధనరాజ్ :

‘జబర్దస్త్’తో ధనరాజ్ పాపులర్ అయ్యాడు. పలు చిత్రాలలో నటించిన ధనరాజ్,  ఆ తర్వాత హీరోగా ‘పనిలేని పులిరాజా’ మూవీలో నటించాడు. కానీ ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ హీరోగా నిలబడేందుకు సినిమాలు ఇంకా చేస్తూ ఉన్నాడు.

5. మహేష్ ఆచంట :

‘జబర్దస్త్’ షోతో కమెడియన్ గా పాపులర్ అయిన మహేష్ ఆచంట పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘రంగస్థలం’ మూవీతో క్రేజ్ సంపాదించుకున్నాడు.  నేను నా నాగార్జున అనే మూవీతో హీరోగా మారాడు. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో మళ్ళీ అటు వైపు చూడలేదు.

6. రాహుల్ రామకృష్ణ :

రాహుల్ రామకృష్ణ కమెడియన్ గా చేనప్పటికి అర్జున్ రెడ్డి మూవీతో సెకండ్ హీరో స్థాయిలో క్రేజ్ ను పొందాడు. పలు సినిమాలలో నటించిన తరువాత హీరోగా నెట్, ఇంటింటి రామాయణం లాంటి సినిమాలలో నటించినా, హీరోగా నిలబడలేకపోతున్నాడు.

7. అభినవ్ గోమఠం :

స్టార్ కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’ మూవీలో నటించాడు. కానీ ఈ మూవీ నెగిటివ్ టాక్ రావడంతో హీరోగా అభినవ్ గోమఠంను ఆడియెన్స్ అంగీకరించడం కష్టం అంటూ కామెంట్స్ మొదలయ్యాయి.

8. వైవా హర్ష :

యూట్యూబ్  ‘వైవా’ తో గుర్తింపు, క్రేజ్ పొందిన హర్ష చెముడు, కామెడీ రోల్స్ చేస్తూ వైవా హర్షగా బాగా పాపులర్ అయ్యాడు. రీసెంట్ గా ‘సుందరం మాస్టర్’ మూవీతో హీరోగా మారాడు. అయితే ఆ మూవీ అంతగా మెప్పించలేదు. దాంతో వైవా హర్షని ప్రేక్షకులు హీరోగా అంగీకరించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: ఫెరారీ 488 తో పాటు… నాగ చైతన్య గ్యారేజిలో ఉన్న 5 సూపర్‌ కార్లు మరియు సూపర్ బైక్‌లు ఇవే..!

 

 


End of Article

You may also like