Drushyam 2: తెలుగు “దృశ్యం 2 ” రిలీజ్ డేట్ ఇదే.. ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ పై రానుందంటే..?

Drushyam 2: తెలుగు “దృశ్యం 2 ” రిలీజ్ డేట్ ఇదే.. ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ పై రానుందంటే..?

by Anudeep

Ads

మలయాళ దృశ్యం మూవీ ని తెలుగు లో కూడా వెంకటేష్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల అయిన మొదటి పార్ట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా.. మలయాళం లో సెకండ్ పార్ట్ విడుదల అయింది. ఇది కూడా మంచి టాక్ తెచ్చుకోవడం తో తెలుగు లో కూడా రీమేక్ చేయాలని భావించారు. సెకండ్ పార్ట్ లో కూడా వెంకటేష్ హీరో గా నటిస్తున్నారు.

Video Advertisement

drushyam 2

కేవలం 45 రోజులలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయడం విశేషం. ఈ సినిమా విడుదల కి సిద్ధం గానే ఉంది. థియేటర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా థియేటర్ లో విడుదల చేయడం కష్టమేనని భావిస్తున్నారు. హాట్ స్టార్ ఓటిటి పై ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. సెప్టెంబర్ 9 లేదా 10 తేదీలలో వినాయక చవితి సందర్భం ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐతే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల అవ్వాల్సి ఉంది.


End of Article

You may also like