టెనెంట్ రెంట్ ఇవ్వట్లేదని ఓనర్ తెలివిగా ఏం చేసారో తెలుసా? దెబ్బకి రెంట్ ఇచ్చాడు..!

టెనెంట్ రెంట్ ఇవ్వట్లేదని ఓనర్ తెలివిగా ఏం చేసారో తెలుసా? దెబ్బకి రెంట్ ఇచ్చాడు..!

by Anudeep

Ads

మనం ఏదన్నా సమస్య నుండి బయట పడడానికి మనకి కండబలం ఉండాలి, లేదంటే బుద్ది బలం అయినా ఉండాలి . బలశాలి అయితే తన కండబలంతో  తప్పించుకుంటాడు. కానీ ప్రతిసారి మన శరీర బలం మనకి సాయపడకపోవచ్చు. కాని ఉపయోగిస్తే మన బుద్దిబలం అదేనండి మన మెదడు మాత్రం ఖచ్చితంగా సాయంచేస్తుంది. ఎలా అంటారా? మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను.

Video Advertisement

నా ఫ్రెండ్ కి సిటీలో ఒక ఫ్లాట్ ఉండేది . తనెలాగు ఊర్లో ఉంటాడు కాబట్టి దాన్ని రెంట్ కి ఇద్దాం అని కొన్నాడు . అనుకున్నట్టుగానే రెంట్ కి ఇచ్చాడు . అద్దెకున్న వ్యక్తి మొదట్లో అద్దె బాగానే చెల్లించే వాడు . కానీ రాను రాను అద్దె చెల్లించడం మానేసాడు . ఫోన్ చేస్తే స్విఛ్చాఫ్ , రింగ్ అయినా కాల్ లిఫ్ట్ చేసే వాడు కాదు, కాల్ బ్యాక్ చేసే వాడు కాదు . మెసేజ్ చేసినా కూడా నో రెస్పాన్స్.. విసిగిపోయి ఒక రోజు మా ఫ్రెండ్ సిటికి బయల్దేరి వెళ్లాడు .తీరా చూస్తే ఫ్లాట్ కి తాళం వేసి ఉంది . ఎటైనా బయటికి వెళ్లాడేమో అని చూసి చూసి  ఊరికి వచ్చేశాడు.

మళ్లీ ఒక రోజు వెళ్లి చూసినా సేమ్ సిట్యుయేషన్ ఎదురైంది. ఇంటికి తాళం ఉంది. ఇలా రెండు మూడు సార్లు తిరిగాక వాచ్ మెన్ ని అడిగాడు అతనెప్పుడొస్తాడని , తెలీదు సర్ ఎప్పుడొస్తాడో , ఎప్పుడుంటాడో నేను కూడా అతన్నెప్పుడూ సరిగా చూడలేదు . కానీ అతను ఇక్కడుండేది వారంలో రెండు , మూడు రోజులు మాత్రమే అని సమాధానం చెప్పాడు వాచ్ మెన్.

వాచ్ మెన్ చెప్పిన సమాధానం విన్నాక నా ఫ్రెండ్ తలపట్టుకున్నాడు. వారం అంతా ఇక్కడే ఉండి అతనొప్పుడొస్తాడో కనిపెట్టడం ఎలా ? అది చాలా కష్టమే అని ఆలోచిస్తూ, మైండ్లో మెరుపు లాంటి ఆలోచన తట్టింది. దాన్ని అమలు చేసి ఎంచక్కా ఊరికి వెళ్లిపోయాడు.మరుసటి రోజు అద్దెకుంటున్న పర్సన్ నుండి కాల్ వచ్చింది , సార్ సార్ తప్పైంది , మీ అద్దె మీకు చెల్లిస్తాను. ఇంటి తాళం పంపించండి అని .

తాళం వేసుకుని బయటికి వెళ్లి, అద్దె కట్టకుండా తప్పించుకున్న పర్సన్ అతనైతే తాళంచెవులు పంపించండి అని ఇతన్ని అడుగుతాడేంటి అని అనుకుంటున్నారా? అదే మరీ ఇక్కడే నా ఫ్రెండ్ తన మైండ్లో మెరిసిన ఐడియాని ఉపయోగించాడు . రెంట్ కి ఉంటున్న వ్యక్తి వేసిన తాళం పైన , నా ఫ్రెండ్ మరొక తాళం వేసి వచ్చాడు. ఆ తాళం చెవుల కోసమే అతను కాల్ చేసింది.. దెబ్బకి తిక్క కుదిరింది, అప్పటి నుండి అద్దె ఎగ్గొట్టకుండా కడుతున్నాడు..TENANT SHOCKS MY FRIEND ROCKS


End of Article

You may also like