“నాన్నతో నరకం చూస్తున్నా.. చంపేయాలనిపిస్తోంది.. వెయిటింగ్ ఫర్ మై డెత్…” అంటూ ఈమె చెప్పిన మాటలు వింటే కన్నీళ్లే..!

“నాన్నతో నరకం చూస్తున్నా.. చంపేయాలనిపిస్తోంది.. వెయిటింగ్ ఫర్ మై డెత్…” అంటూ ఈమె చెప్పిన మాటలు వింటే కన్నీళ్లే..!

by Anudeep

Ads

ఏ అమ్మాయి అయినా తన తల్లి కంటే తండ్రికి ఎక్కువ దగ్గరగా ఉంటుంది. ఎంత అల్లరి చేసినా.. గొడవ పడినా తండ్రి దగ్గరే అమ్మాయిలు చనువుగా ఉంటారు. కానీ, ఈ అమ్మాయి మాత్రం తన తండ్రి వలన నరకం అనుభవిస్తున్నానని వాపోతోంది. మూడు సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించినా.. ఎవరో ఒకరు కాపాడుతూనే వచ్చారని బాధపడుతోంది. ఈమె స్టోరీ తెలిస్తే కన్నీళ్లు పెడతారు.

Video Advertisement

వివరాల్లోకి వెళితే.. పదవ తరగతి పరీక్షలకు ముందు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం బుగ్గోనిగూడ కు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన సోమవారం చోటు చేసుకుంది.

మృతి చెందిన విద్యార్థిని సోదరుడు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు, లలిత దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె మనీషా ప్రస్తుతం పదవ తరగతి చదువుకుంటోంది. ఆమె తల్లి లలిత ఏడాది క్రితమే మృతి చెందారు. అయితే.. భార్య లలిత చనిపోయేసరికి నరసింహులు మానసికంగా కృంగిపోయాడు. తాగుడుకు బానిస అయ్యాడు. ఆ మైకంలో కుమార్తె తోనూ, కుమారుడి తోనూ గొడవ పడుతుండేవాడు.

ఆదివారం ఉదయం కూడా ఇదే జరిగింది. ఆరోజు మధ్యాహ్నం అయ్యేసరికి మనీషా ఉరి వేసుకుంది. మధ్యాహ్నం కుమారుడు తండ్రి నరసింహులు ఫోన్ చేసి.. చెల్లి ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుంది అని చెప్పాడు. దీనితో ఆ తండ్రి వెంటనే ఇంటికి వచ్చి చూసేసరికి మనీషా మెడ భాగంలో కమిలిపోయి ఉంది. ఆమె అప్పటికే మరణించింది. పక్కనే ఓ పుస్తకంలో “ఐ హేట్ మై డాడ్” అని నాలుగు సార్లు రాసి ఉంది. గతంలో తల్లి గురించి రాసిన లేఖ కూడా బయట పడింది. అందులో ” నా తండ్రి ఓ మూర్ఖుడు.. తాగి వచ్చి నరకం చూపిస్తున్నాడు. మా అమ్మ ఉన్నప్పుడు బానే ఉండేవాడు. తరువాత తాగుడుకు బానిసై మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. నాన్నా అని పిలవడానికి మనసు రావట్లేదు.. మూడు సార్లు ఉరి వేసుకున్నా ఎవరో ఒకరు కాపాడారు.. ఇంకొన్ని రోజుల్లో నా చావు వార్త అందరికి తెలుస్తుంది. వెయిటింగ్ ఫర్ మై డెత్..” అని ఆ లేఖలో రాసి ఉంది.


End of Article

You may also like