Ads
మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.
Video Advertisement
తెలుగులో కూడా విజయ్ క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రూపొందుతోంది. ఈ సినిమా విజయ్ 66వ సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేసారు. విజయ్ హీరోగా నటించిన సినిమాలు అన్ని తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. కానీ అంతకుముందు విజయ్ హీరోగా నటించిన కొన్ని తమిళ సినిమాలు మాత్రం తెలుగులో రాలేదు.
విజయ్ అంతకు ముందు చేసిన సినిమాల్లో కొన్ని సీన్స్ కి చాలా చర్చ జరిగింది. ఎన్నో నెగిటివ్ కామెంట్ కూడా వచ్చాయి. మంచి సీన్స్ కామెడీగా చేశారు అంటూ చాలా మంది కామెంట్ చేశారు. కానీ తర్వాత తర్వాత విజయ్ తన కథల సెలక్షన్ మార్చుకొని టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. తుపాకి సినిమా నుండి విజయ్ కథలు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే కాకుండా అందులో ఒక మంచి మెసేజ్ ఉండేలాగా అలాగే సినిమాకి సినిమాకి స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉండేలాగా చూసుకుంటున్నారు.
అంతకుముందు చాలా రీమేక్ సినిమాలు చేసిన విజయ్ ఈ మధ్య రీమేక్ సినిమాలు కూడా తగ్గించారు. అయితే విజయ్ అంతకుముందు హీరోగా నటించిన ఒక సినిమాలోని ఒక ఫైటింగ్ సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో విజయ్ బైక్ నడుపుతూ ఉంటారు. చుట్టూ రౌడీలు వేరే వేరే వాహనాల్లో విజయ్ ని కొట్టడానికి వస్తూ ఉంటారు. అప్పుడు విజయ్ వారందరినీ తిరిగి కొడుతూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే విజయ్ బైక్ నడుపుతూనే వారందరినీ కొడతారు. అసలు ఇలాంటి గ్రాఫిక్స్ ఇప్పటివరకు ఎలాంటి సినిమాల్లోనూ చూడలేదు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
watch video :
https://www.instagram.com/reel/Chl5FUfp4yZ/?igshid=YmMyMTA2M2Y%3D
End of Article