Ads
తమిళ హీరో అయినా కూడా తెలుగులో గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్. తుపాకీ సినిమా నుండి విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులో విడుదల అవుతుంది. ఇటీవల లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇప్పుడు గోట్ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి కూడా అడుగు పెడుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. విజయ్ తండ్రి పేరు ఎస్ ఏ చంద్రశేఖర్, తల్లి పేరు శోభ. విజయ్ కి విద్య అనే ఒక చెల్లెలు కూడా ఉండేవారు. విద్య తనకి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. విజయ్ కి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వెట్రి అనే తమిళ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
Video Advertisement
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తర్వాత, 1992 లో నాలయ తీర్పు అనే సినిమాతో హీరోగా అడుగు పెట్టారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అయితే, విజయ్ మొదట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. యాక్టింగ్ రాదు అని, అసలు హీరో ఎలా అయ్యారు అని విజయ్ గురించి మ్యాగజిన్స్ లో రాసేవారు. కానీ విజయ్ వాటన్నిటిమీద తనని తాను మెరుగుపరుచుకొని, ఇప్పుడు స్టార్ హీరో అయ్యారు. తుపాకి సినిమా విజయ్ ని స్టార్ హీరో చేసింది. ఆ సినిమా నుండి విజయ్ సినిమాల సెలక్షన్ కూడా మారిపోయింది. అంతకుముందు వరకు విజయ్ కొన్ని కమర్షియల్ సినిమాలు చేశారు.
కానీ అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ తుపాకి సినిమా నుండి విజయ్ తన సినిమాలని జాగ్రత్తగా ఎంచుకోవడం మొదలుపెట్టారు. కమర్షియల్ సినిమాలు అయినా కూడా అందులో అన్ని అంశాలు సమంగా ఉండేలాగా చూసుకున్నారు. విజయ్ ఇవాళ తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గోట్ సినిమా నుండి ఒక టీజర్ విడుదల చేశారు. ఇందులో ఇద్దరు విజయ్ లు కనిపిస్తున్నారు. అంటే విజయ్ ఈ సినిమాలో తండ్రిగా, కొడుకుగా నటిస్తున్నారు. మీరు ఇప్పటి వరకు చూడని విజయ్ అరుదైన ఫోటోలు కొన్ని ఇవే.
#1
#2#3
#4#5#6#7#8#9#10#11#12#13#14#15
End of Article