Ads
ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో అనే గుర్తింపు, కోట్లలో రెమ్యూనరేషన్, మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఆయన సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. కానీ ఇవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వెళ్దాము అని నిర్ణయించుకున్నారు హీరో విజయ్.
Video Advertisement
విజయ్ తమిళ సినిమాలతో తెలుగులో చాలా ఫేమస్ అయ్యారు. కొంత మంది విజయ్ ని ట్రోల్ చేసే వాళ్ళు ఉంటే, చాలా మంది ఆయనకి అభిమానులు కూడా ఉన్నారు. ప్రస్తుతం విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మరొక సినిమాలో నటిస్తారు.
ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ తన సినిమా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి, తన కెరీర్ ని రాజకీయాలకు అంకితం చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ విషయానికి సంబంధించి నిన్న ఒక లెటర్ విడుదల చేశారు. అయితే, విజయ్ తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు అనే వార్త వచ్చింది. అసలు విజయ్ ఇప్పటి నుండి పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటారా? లేదా కొంత సమయం పూర్తిగా రాజకీయాల్లో గడిపిన తర్వాత మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధం అవుతారా? ఈ విషయం మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అయితే విజయ్ తన పార్టీ పేరుని, తమిళ వెట్రి కళగం అని ప్రకటించారు. తమిళ వెట్రి కళగం అంటే, తమిళుల విజయానికి సంస్థ అని అర్థం వస్తుంది. విజయ్ రాజకీయాల్లోకి వస్తారు అనే విషయం ఇప్పటిది కాదు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ వార్త వస్తూనే ఉంది. ఎట్టకేలకు ఇప్పటికి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు.
గతంలో కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కూడా విజయ్ చేపట్టారు. కానీ తన సినిమాలను ఆపి రాజకీయాలకి తన కెరీర్ ని అంకితం చేయడం అనేది అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. అటు రాజకీయాలు, ఇటు సినిమాలో రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటే బాగుండేది ఏమో అని అంటున్నారు. మరి విజయ్ మళ్ళీ సినిమాల్లోకి వస్తారో లేదో తెలియదు. ఈ విషయం మీద విజయ్ నిర్ణయం తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.
ALSO READ : ఈ 8 మంది “తెలుగు” టాప్ హీరోలతో నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?
End of Article