ఆ సినిమా మీద నాకు ఇంకా నమ్మకం రాలేదు: తరుణ్ భాస్కర్

ఆ సినిమా మీద నాకు ఇంకా నమ్మకం రాలేదు: తరుణ్ భాస్కర్

by Mounika Singaluri

Ads

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి అందరికీ పరిచయమే. పెళ్లిచూపులు సినిమాతో డైరెక్టర్గా ఎంటర్ అయ్యి ఆ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు సంపాదించాడు. చిన్న సినిమాగా వచ్చిన పెళ్లి చూపులు తర్వాత పెద్ద హిట్ అయింది.

Video Advertisement

ఆ తర్వాత ఆయన రెండో చిత్రంగా వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా యూత్ లో విపరీతమైన సంపాదించుకుంది. ఈ సినిమా గురించి అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉంటారు.

ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత కీడా కొల అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ గ్యాప్ లో ఆయన నటుడుగా కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. పలు టీవీ షోలకు హోస్ట్ గా కూడా చేశారు. ప్రస్తుతం కీడ కోల సినిమా ప్రమోషన్స్ లో తరుణ్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు.


అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా గతంలో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నారని వార్త వినిపించిందని ఆ సినిమా ఏమైందంటూ మీడియా వారు అడిగారు.ఈ ప్రశ్నకు స్పందించిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం వెంకటేష్ సినిమాని పక్కన పెట్టినట్లు తెలిపారు. అయితే ఆ సినిమా ఖచ్చితంగా ఉంటుందని అది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్పారు. కాకపోతే దాని ఎండింగ్ సరిగ్గా రావడంలేదని ఇప్పటికీ కథ మీద పనిచేస్తున్నట్లు తెలిపారు. పెద్ద హీరోతో అవకాశం వచ్చింది కదా అని తొందరపడి ఏదో తీస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని అన్నారు.

ఆ తర్వాత తరుణ్ భాస్కర్ కి పెద్ద హీరోలను హ్యాండిల్ చేయడం రాదని ఇష్టం వచ్చినట్టు రాస్తారంటూ ఆన్సర్ చెప్పారు.తాను వెంకటేష్ తో సినిమా తీస్తే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని, ఆ కాన్ఫిడెన్స్ తనకు వచ్చిన తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేస్తాను అని తెలియజేశారు.

Also Read:25 కోట్లతో సాంగ్ షూటింగా….! ఇంత క్రేజ్ ఏంటి సామి…!


End of Article

You may also like