KEEDAA COLA REVIEW : “తరుణ్ భాస్కర్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

KEEDAA COLA REVIEW : “తరుణ్ భాస్కర్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. 30 వెడ్స్ 21 సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు చైతన్య రావు. ఇప్పుడు చైతన్య రావు హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కీడా కోలా. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : కీడా కోలా
  • నటీనటులు : బ్రహ్మానందం, రాగ్ మయూర్, చైతన్య రావు, జీవన్.
  • నిర్మాత : కె. వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్
  • దర్శకత్వం : తరుణ్ భాస్కర్
  • సంగీతం : వివేక్ సాగర్
  • విడుదల తేదీ : నవంబర్ 3, 2023

keedaa cola movie review

స్టోరీ :

మూడు గ్యాంగుల మధ్య సినిమా కథ అంతా నడుస్తుంది. వరదరాజు (బ్రహ్మానందం), వాస్తు (చైతన్య రావు), లంచం (రాగ్ మయూర్) ఒక గ్రూప్. వారు కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు. వాటి నుండి బయటపడేందుకు ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి అని నిర్ణయించుకుంటారు. వారు ఒక సారి కీడా కోలా కొంటారు. అందులో అనుకోకుండా ఒక బొద్దింక దూరుతుంది.

keedaa cola movie review

దాంతో ఆ కోలా తయారుచేసిన కంపెనీ మీద కేసు వేసి డబ్బులు తీసుకోవాలి అని వీళ్లు చూస్తూ ఉంటారు. మరొక పక్క జీవన్ (జీవన్), నాయుడు (తరుణ్ భాస్కర్), సికందర్ (విష్ణు) వీళ్ళు ఒక గ్రూప్. వీరిలో జీవన్ కొన్ని అవమానాలు ఎదుర్కొంటాడు. దాంతో ఎలాగైనా సరే తను పెద్ద కార్పొరేటర్ అయ్యి పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. జైలు నుండి వచ్చిన జీవన్ అన్న నాయుడు, జైలుకి వెళ్లే ముందు రౌడీ లాగా ఉన్న వ్యక్తి, జైలు నుండి వచ్చాక శాంతంగా మారిపోతాడు. గొడవల జోలికి వెళ్లడు. కీడా కోలా కంపెనీలో పని చేస్తూ ఉంటాడు.

keedaa cola movie review

కార్పొరేటర్ కావాలి అంటే కోటి రూపాయలు కావాలి. దాని కోసం నాయుడు ఒక ప్లాన్ వేస్తాడు. తను పని చేస్తున్న చోట అ కోలాలో ఒక బొద్దింకని వేస్తాడు. మరొక పక్క ఇంకొక గ్యాంగ్ అయిన కీడా కోలా సీఈవో (రవీంద్ర విజయ్) అదే బ్రాండ్ మీద మరొక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలి అనుకుంటాడు. అప్పుడు వీళ్ళందరూ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వరదరాజు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ లో గెలిచేది ఎవరు? డబ్బులు ఎవరికి వెళ్ళాయి? ఆ డబ్బుల కోసం వీళ్ళు ఎలాంటి పనులు చేశారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

keedaa cola movie review

రివ్యూ :

సాధారణంగా చాలా సినిమాల మీద సినిమాలో నటించే హీరోల వల్ల ఆసక్తి పెరుగుతుంది. చాలా తక్కువ సినిమాలకి సినిమాకి దర్శకత్వం వహించే దర్శకుడి వల్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా రెండవ రకానికి చెందుతుంది. పెళ్లిచూపులు సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. కానీ కల్ట్ క్లాసిక్ అయ్యింది.

keedaa cola movie review

ఇటీవల ఈ సినిమా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్లీ రిలీజ్ చేశారు. అప్పుడు బాగా కలెక్షన్స్ వచ్చాయి. దాంతో మొదటి రెండు సినిమాల్లో ఇన్ని వేరియేషన్స్ చూపించిన తరుణ్ భాస్కర్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో ఉంది. చాలా అంచనాల మధ్యలో ఈ సినిమా బయటికి వచ్చింది. ప్రస్తుతం డార్క్ కామెడీ లేదా కామెడీ జోనర్ అంటే ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. స్క్రిప్ట్ సంగతి పక్కన పెడితే, సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని మూడు గంటల పాటు నవ్విస్తే ఆ సినిమా హిట్ అయినట్టే.

keedaa cola movie review

ఇంక ఈ సినిమా విషయానికి వస్తే కూడా కామెడీని మెయిన్ పాయింట్ గా రాసుకున్నారు. కానీ సినిమా మొత్తం ప్రేక్షకుడిని మాత్రం నవ్వించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. అక్కడక్కడ కామెడీ సీన్స్ మాత్రం వర్కౌట్ అయ్యాయి. కానీ ప్రతి కామెడీ సీన్ ఏమీ నవ్వు తెప్పించలేదు. సినిమా చూస్తున్నంత సేపు ఏదో తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. తరుణ్ భాస్కర్ మార్క్ ఎక్కడా కనిపించదు.

keedaa cola movie review

బహుశా మూడు సినిమాలు పోల్చి చూస్తే ఈ సినిమా కాస్త వీక్ గా ఉంటుంది ఏమో. సెకండ్ హాఫ్ లో మాత్రం కామెడీ చాలా బాగుంది. చివరికి ఒక ట్విస్ట్ ఇస్తారు. కానీ అది కూడా తెలిసిందే. కథ కూడా రొటీన్ గానే ఉంటుంది. చాలా సినిమాల్లో ఇలాంటి స్టోరీలు చూసాం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. తరుణ్ భాస్కర్ పోషించిన నాయుడు పాత్ర బాగుంది. అలాగే విష్ణు పాత్ర కూడా బాగుంది. బ్రహ్మానందం పాత్ర గురించి మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే నిరాశ పడతారు.

keedaa cola movie review

అంత పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర ఏమి కాదు. కానీ ఉన్నంతలో బ్రహ్మానందం బాగా చేశారు. వివేక్ సాగర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ ఇంక మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా పని చేశారు. కానీ ఫస్ట్ హాఫ్ విషయంలో, అలాగే కథ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • కొన్ని కామెడీ సీన్స్
  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • తెలిసిపోయే కథ
  • బోరింగ్ గా సాగే ఫస్ట్ హాఫ్
  • బలహీనంగా ఉన్న క్లైమాక్స్
  • సాగదీసినట్టు ఉండే కొన్ని సీన్స్

రేటింగ్ : 

2.5/5

ట్యాగ్ లైన్ :

మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, తరుణ్ భాస్కర్ ముందు సినిమాలని కూడా మైండ్ లో పెట్టుకోకుండా, రొటీన్ స్టోరీ అయినా పర్వాలేదు, కాస్త డ్రాగ్ చేసే సీన్స్ ఉన్నా పర్వాలేదు అని అనుకొని, కేవలం ఒక కామెడీ సినిమా చూద్దాం అని అనుకునే వారికి కీడా కోలా సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : ఈ ఫోటోలో మెగా ఫ్యామిలీతో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?


End of Article

You may also like