Ads
ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని సినిమాలు వెనకడుగు వేశాయి. బంగార్రాజు మాత్రం మొదటి నుండి సంక్రాంతి బరిలోనే ఉంది. పైగా చెప్పినట్టుగానే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. కథాపరంగా చూస్తే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి, బంగార్రాజు సినిమాకి పెద్ద తేడా కనిపించదు. స్టోరీ లైన్ దాదాపు అలాగే ఉంది. కానీ హీరో హీరోయిన్లని మార్చడం వల్ల కొంచెం కొత్తగా అనిపించింది.
Video Advertisement
ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణన్, క్రితి శెట్టి బాగా నటించారు. ఉప్పెన సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న కృతి శెట్టి కి బంగార్రాజు లో అవకాశం దొరికింది. సర్పంచ్ నాగలక్ష్మిగా కృతి శెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మొదట కృతి శెట్టి హీరోయిన్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు.
కానీ చాల మలుపులు తిరిగాయి. నిజానికి క్రితి శెట్టి ఈ సినిమాలో నటించడం వెనుక ఒక పెద్ద కధే వుంది. అదేమిటో చూద్దాం. ఈ సినిమాకి మొదట కృతి శెట్టిని హీరోయిన్ కింద అనుకున్నారు. కానీ తర్వాత కృతి శెట్టిని కాదనుకున్నారు. అయితే అసలు ఏమైంది అంటే… ఉప్పెన షూటింగ్ అవుతున్నప్పుడు కృతి శెట్టిని చిత్ర యూనిట్ నటించమని అడిగింది. అయితే అప్పటికే రెండు సినిమాలకు కృతి ఓకే చెప్పడంతో బంగార్రాజు సినిమాకి నో చెప్పిందట.
ఆ తర్వాత బంగార్రాజు చిత్ర యూనిట్ రష్మిక మందనని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. అయితే చివరికి డేట్స్ అడ్జస్ట్ చేస్తామని కృతి శెట్టి వెనక్కి వచ్చి బంగార్రాజు చిత్రానికి ఓకే చెప్పేసింది. ఇలా కృతి శెట్టి కి అవకాశం వచ్చింది. అలానే హిట్ కూడా కృతి శెట్టి కొట్టింది.
End of Article