Home Filmy Adda ఆ ఒక్క విషయమే నన్ను, ప్రభాస్ ని కలిపేసింది అంటున్న కృతిసనన్.. ప్రభాస్ గురించి ఇంకా ఏమన్నారంటే..?

ఆ ఒక్క విషయమే నన్ను, ప్రభాస్ ని కలిపేసింది అంటున్న కృతిసనన్.. ప్రభాస్ గురించి ఇంకా ఏమన్నారంటే..?

by Anudeep

బాహుబలి తరువాత ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్ ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్నారు. ప్రభాస్, కృతి సనన్ లు హీరో హీరోయిన్లు గా “ఆదిపురుష్” సినిమా లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతోంది. ఈ క్రమం లో బాలీవుడ్ నటి కృతి సనన్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో కృతి ప్రభాస్ గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

prabhas kruthi

ఈ సినిమాలో రాముడి గా ప్రభాస్, సీత గా కృతి సనన్ నటిస్తున్న సంగతి తెల్సిందే. షూటింగ్ సమయం లో వీరిద్దరూ బాగా కలిసిపోయారట. చాలా మంది ప్రభాస్ గురించి చెబుతూ ఆయనకు చాల మొహమాటం ఎక్కువ అని చెప్పారని.. కానీ ప్రభాస్, నేను బాగానే కలిసిపోయాం అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఓ విషయం మా ఇద్దరికీ చాల కామన్ అని.. దానివల్లనే ఇద్దరం తొందరగా కలిసిపోయామని ఆమె చెప్పారు.

prabhas kruthi

ఇంతకీ అదేంటంటే.. ఫుడ్ అట. ఇద్దరికీ ఫుడ్ అంటే బాగా ఇష్టం. బహుశా ఆ విషయమై మా ఇద్దరినీ దగ్గర చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కృతి సనన్ ఈ విషయాలు పంచుకున్నారు. ప్రభాస్, కృతి సనన్ ప్రస్తుతం “ఆదిపురుష్” షూటింగ్ తో బిజీ గా ఉన్నారు.

Watch Video:

You may also like