Ads
ఇప్పుడు హీరో హీరోయిన్లు ప్రతి సినిమాకి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అలాగే చాట్ షోస్ ద్వారా వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి కూడా మనందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా, ఏ సెలబ్రిటీ ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? వంటి వివరాలు అన్ని తెలిసిపోతుంటాయి. కానీ ఒక 20 – 30 ఏళ్ల క్రితం ఉన్న కొంత మంది సెలబ్రిటీల వివరాలు ఎవరికీ అంత పెద్దగా తెలియవు.
Video Advertisement
వాళ్లకి ఇప్పటికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరూ తమ అభిమాన సెలబ్రిటీ ఇప్పుడు ఏం చేస్తున్నారో? అని అనుకుంటారు. కొంత మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటారు. ఇంక వాళ్లకు సంబంధించిన విషయాలు అయితే అస్సలు తెలియవు. అలా కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో తమ పర్ఫార్మెన్స్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న సెలబ్రిటీలందరినీ మళ్ళీ మనకి తిరిగి పరిచయం చేసే షో ఆలీతో సరదాగా.
ఆలీతో సరదాగా షో లో అంతకుముందు మనల్ని అలరించిన ఎంతో మంది యాక్టర్స్, అలాగే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడారు. వాళ్లలో సరిత, యమున, కస్తూరి, అర్చన, రోహిణి ఇలా ఎంతో మంది ఉన్నారు.
వీళ్లు మాత్రమే కాకుండా ఇప్పుడు ఉన్న యాక్టర్స్ కూడా షోకి వస్తూ ఉంటారు. అయితే మనలో కొంతమందికైనా ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు. అదేంటంటే? “షో కి వచ్చే వాళ్లు ఎటువంటి పారితోషికం తీసుకోకుండా వస్తారా? లేదా డబ్బులు తీసుకుంటారా?” అని.
ఆలీతో సరదాగా షో కి వచ్చే వాళ్లకి లక్ష రూపాయలు ఇస్తారు అనే వార్త వినిపిస్తోంది. ఒకవేళ సినిమా ప్రమోట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎటువంటి డబ్బులు తీసుకోరు. అంతే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాళ్లకి ఫ్లైట్ ఖర్చులు, ఉండడానికి హోటల్ ఏర్పాట్లు కూడా నిర్మాతలు చూసుకుంటారు.
End of Article