గూగుల్‌లో ఉద్యోగం కోసం ఎందరో యువత పోటీ పడుతుంటారు. మరి అదే సంస్థలో ఏడాదికి 60 లక్షల రూపాయల భారీ ప్యాకేజీతో ఉద్యోగం వస్తే సూపర్‌ కదా..! మన గుంటూరు అమ్మాయి రావూరి పూజిత ఆ లక్ష్యాన్ని చేరుకుంది. ఆమె ఈ స్థాయికి సులువుగా చేరలేదు. ఎంతో కష్టపడింది. మధ్యలో కరోనా కారణం గా లాక్డౌన్ వచ్చినా.. ఆ సమయాన్ని కూడా తన గెలుపు కోసం ఉపయోగించుకుంది పూజిత. లాక్ డౌన్ లో యూట్యూబ్ వీడియోల ద్వారా కోర్స్ నేర్చుకుని.. గూగుల్ లో రూ. 60 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఆమె విజయ గాథ మనం కూడా తెలుసుకుందాం..

Video Advertisement

 

“నాకు జేఈఈలో ఝార్ఖండ్‌ బిట్స్‌లో సీటు వస్తే అమ్మానాన్నలు అంత దూరం ఎందుకన్నారు. దాంతో గుంటూరులోని కేఎల్‌ వర్సిటీలో బీటెక్‌లో చేరా. ఫస్టియర్‌ మొదటి సెమ్‌లో ఉండగా కేఎల్‌ వర్సిటీ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ కోర్సు ప్రవేశపెట్టింది. అలా నా కోడింగ్‌ ప్రయాణం ప్రారంభమైంది. రెండో సెమిస్టర్‌ ముగిసే సమయానికి లాక్‌డౌన్‌. లాక్‌డౌన్‌ లో కాలేజీ వాళ్లు ఆన్‌లైన్లో చెప్పే పాఠాలని శ్రద్ధగా వినేదాన్ని. నా సందేహాలు, సమస్యలను వీలున్నంత వరకూ టీచర్లనో, సీనియర్లనో అడిగేదాన్ని. వీలుకానప్పుడు ఆన్‌లైన్‌లో వెతికేదాన్ని. యూట్యూబ్‌ వీడియోలను చూసి కోడింగ్‌పై పట్టు సాధించా. ” అని పూజిత తెలిపింది.

the girl who got job in google..

” ఏ సాప్ట్‌వేర్‌ కంపెనీ అయినా కోడింగ్‌ నుంచే ఎక్కువ ప్రశ్నలు సంధిస్తుంది కాబట్టి దానిపై పట్టుకోసం చాలా వెబ్‌సైట్లు చూసేదాన్ని. ఆ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కోడింగ్‌, ఇతర ప్రాబ్లమ్స్‌తో పాటు ఉద్యోగం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకున్నా. రోజులో సగం సమయం ఆన్‌లైన్‌ క్లాసులు వింటే తక్కిన సమయంలో ఆన్‌లైన్‌లో సొంతంగా నేర్చుకొనేదాన్ని. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్లు, ఇంటర్వ్యూలు సాధన చేశా. తరచూ మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యేదాన్ని. ఆన్‌లైన్‌లో సీనియర్లతో పరిచయాలు పెంచుకుని వాళ్ల అనుభవాలు తెలుసుకునేదాన్ని. ” అని తన ఉద్యోగ ప్రయత్నాలను వివరించింది పూజిత.

the girl who got job in google..

ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంటర్వ్యూల్లో విజయం సాధించానని పూజిత వెల్లడించింది. గూగుల్, అడోబ్, అమెజాన్ వంటి సంస్థల్లో ఉద్యోగం సాధించగా.. గూగుల్ లో చేరేందుకు ఆమె సిద్దమయ్యింది. త్వరలో గూగుల్ ఇంటర్న్‌షిప్‌కు వెళ్తున్నా అంటూ ఆమె తెలిపింది. ఉద్యోగం లో గుర్తింపు, అనుభవం వచ్చాక ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడమే తన లక్ష్యమని ఆమె వెల్లడించింది. ఇలా లాక్ డౌన్ లో సమయాన్ని సద్వినియోగం చేసుకొని అందరికి ఆదర్శం గా నిలిచింది కదా..