ఈ ఫోటోలో డిగ్రీ పట్టాతో కూర్చున్న వ్యక్తి తర్వాత చాలా గొప్ప హీరో అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో డిగ్రీ పట్టాతో కూర్చున్న వ్యక్తి తర్వాత చాలా గొప్ప హీరో అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీకి వచ్చే వారి మీద చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. చదువుకోకుండా చాలా మంది సినిమాల్లోకి వస్తారు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా మంది తమ చదువులు పూర్తి చేసుకొని సినిమాల్లోకి వెళ్తారు. కొంత మంది ఉన్నత చదువులు చదివాక కూడా సినిమాల్లోకి వెళ్తారు. ఇంకా కొంత మంది అయితే చదువు పూర్తి చేసుకొని, కొన్నాళ్లు ఉద్యోగం చేసి తర్వాత సినిమాల్లోకి వెళ్తారు. ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కొక్క లాగా ఉంటుంది. కానీ చదువుని నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరూ సినిమాల్లోకి వెళ్తారు అనేది మాత్రం నిజం కాదు. చదువుకున్న వారు కూడా సినిమాల్లోకి వెళ్తారు.

Video Advertisement

the man with degree certificate is hero

సినిమాల్లోకి వెళ్లి ఎంత గుర్తింపు తెచ్చుకున్నా కూడా చదువుకి ప్రాముఖ్యత ఇచ్చిన వారు ఉన్నారు. సినిమాలతో పాటు చదువు కూడా ముఖ్యం అని అనుకుంటారు. ఈ పైన ఫోటోలో ఉన్న వ్యక్తి తెలుగు సినిమా గర్వించదగ్గ పెద్ద హీరో అయ్యారు. ఇది ఆయన డిగ్రీ పట్టా తీసుకుంటున్నప్పుడు తీసిన ఫోటో. నందమూరి తారక రామారావు గారి గురించి తెలియని వారు ఉండరు. తెలుగు సినిమాని జాతీయస్థాయిలో పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. నందమూరి తారక రామారావు గారు 1945లో తీయించుకున్న ఫోటో ఇది. మధ్యలో కూర్చున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. గుంటూరులో ఉన్న ఏసీ కాలేజ్ లో బీఏ డిగ్రీ పట్టా తీసుకున్న తర్వాత స్టూడియో కి వెళ్లి తన మిత్రులతో కలిసి ఫోటో దిగారు.

ఈ ఫోటోని కోరాలో వెంకట రమణ సూరంపూడి గారు షేర్ చేశారు. ఇదే ఫోటోలో ఎన్టీఆర్ గారితో పాటు ఆయన మిత్రులు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ గారు చదువుకోవడం, తర్వాత ఉద్యోగం చేయడం, ఆ తర్వాత సినిమాల్లోకి రావడం, సినిమాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకోవడం, నటనలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా రాణించడం అందరికీ తెలిసిన విషయం. తెలుగు సినిమా ఇండస్ట్రీ గతంలో మద్రాస్ లో ఉండేది. అక్కడి నుండి తెలుగు రాష్ట్రాలకి తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకురావడానికి కృషి చేసిన వారిలో మొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా వెళ్లి రాష్ట్రానికి సేవ చేశారు.


End of Article

You may also like