Ads
మోసపోయినవారు ఉన్నంత వరకు మోసం చేసే వాడికి కొదవేలేదు. మోసగాళ్లకు మాయమాటలు చెప్పి అమాయక ప్రజలు నమ్మిస్తూ తమ దారిలోకి తెచ్చుకుంటారు. అసలు విషయం తెలుసుకున్నాక మోసపోయిన వారు లబోదిబోమంటు మోరపెట్టుకుంటారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి మన ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Video Advertisement
అసలు వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడపా శివశంకర బాబు కొత్తరకం మోసంతో ముందుకు వచ్చాడు. అడపా శివ శంకర్ ఇంజనీరింగ్ పూర్తిచేసాడు. మ్యాట్రిమోనీ సెట్ రెండో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న మహిళలను వెతికి జల్లెడ పట్టాడు.
విడాకులు తీసుకుని బాగా చదువుకొని, ఉద్యోగం చేస్తూ రెండో పెళ్లి కోసం చూసే మహిళలే అతని టార్గెట్. ఇదే అదునుగా భావించి నకిలీ విడాకుల పత్రాలు తీసుకుని, మొదటి పెళ్లి అయ్యింది, విడాకులు తీసుకున్న వ్యక్తిని అంటూ, నేను పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నేను నెలకు రెండు లక్షల సంపాదిస్తున్నాను అంటూ దొంగ పేస్లిప్స్ తో ఆ అమాయక మహిళలను నమ్మించాడు.
అంతేకాకుండా నేను మంత్రి ఫ్రెండ్ అంటూ వాళ్లతో చెప్పుకొచ్చాడు. అంబటి రాంబాబు స్వయాన మా చట్టం అంటూ వాళ్లతో నమ్మబలికాడు. ఇలా నమ్మించి ఏడుగురిని పెళ్లాడాడు. ఒకే కాలనీ లో ముగ్గురు భార్యలు పక్క పక్క గల్లీలో ఒకరికి తెలియకుండా ఒకరితో కాపురం పెట్టేశాడు. ఇప్పుడు ఇంకో మహిళతో అదృశ్యమైపోయాడు. అతను పరారు కావడంతో అసలు విషయం తెలుసుకొని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించారు.
Source : https://fb.watch/efA8GYhpOZ/
End of Article