“క్షమించండి … తప్పయింది ..!” – మేకప్ ఆర్టిస్ట్ “శ్వేతా రెడ్డి”..! అసలు ఏం జరిగింది అంటే ..?

“క్షమించండి … తప్పయింది ..!” – మేకప్ ఆర్టిస్ట్ “శ్వేతా రెడ్డి”..! అసలు ఏం జరిగింది అంటే ..?

by Anudeep

Ads

‘కాంతార’ సినిమా తరహాలో పంజార్లి దేవుడి వేషం వేసుకొని ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసిన యువతి శ్వేతా రెడ్డి క్షమాపణ కోరారు. హైదరాబాద్ కు చెందిన శ్వేతా రెడ్డి ఒక మేకప్ ఆర్టిస్ట్. ఆమె ఇటీవల ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ ఒక రీల్ చేసి కొడగు ప్రజల ఆక్రోశానికి గురైన విషయం తెల్సిందే.

Video Advertisement

కాంతార చిత్రం లోని ‘వరాహ రూపం’ సాంగ్ లో లాగా మేకప్ వేసుకొని, దుస్తులు ధరించి ఆమె ఒక రీల్ చేసారు. వెంటనే నెటిజన్లు ఆమె పై విరుచుకు పడ్డారు. ఒక దేవుడి వేషధారణని ఆమె అవమానించింది అంటూ కామెంట్లు గుప్పించారు. ధర్మస్థల మంజు నాథ స్వామి ఆమె ని శిక్షిస్తాడంటూ కొందరు కామెంట్లు పెట్టడం తో.. ఆమె శుక్రవారం మంజునాథ స్వామి సన్నిధి లో కొడగు ప్రజలకు క్షమాపణ చెప్పారు.

the women who makes reels as panjarli shows apologies to god..

తన తప్పు తెలుసుకున్నానని, అందుకే తప్పు కనికే అర్పించి క్షమాపణలు చెప్పానని చెప్పింది. “తెలిసి చేయలేదు. యక్షగానం మరియు దైవారాధన ఒకటే అని నేను అనుకున్నాను, కానీ వారిద్దరూ వేర్వేరు అని, ఇక్కడ ప్రజలు దైవాన్ని ఆరాధిస్తారని నేను తరువాత గ్రహించాను, ప్రజల మనోభావాలను నేను గాయపరిచినట్లయితే, క్షమించండి. నేను నా తప్పును గ్రహించి తప్పు కనికే సమర్పించాను, “అని ఆమె మీడియా తో చెప్పింది.

the women who makes reels as panjarli shows apologies to god..

ఈ నేపథ్యం లో ఆమె ధర్మస్థల ట్రస్ట్ అధ్యక్షుడు వీరేంద్ర హెగ్డే ని కలిసి క్షమాపణలు కోరారు.


End of Article

You may also like