Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది.
తాజాగా.. నిన్న ముంబై లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే.. ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ తో సహా పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. అయితే.. ఈవెంట్ ను లైవ్ పెట్టకపోవడంతో.. ఫ్యాన్స్ కొంచం అప్ సెట్ అయ్యారు. ఇంత మంచి ఈవెంట్ జరుగుతుంటే లైవ్ ఇవ్వకపోవడం ఏంటి…? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
End of Article