ఒరిజినల్ కథ కాకపోయినా ఇంత క్రేజ్ ఎందుకు..? అసలు ఏం ఉంది..?

ఒరిజినల్ కథ కాకపోయినా ఇంత క్రేజ్ ఎందుకు..? అసలు ఏం ఉంది..?

by kavitha

Ads

సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో నటించిన కమర్షియల్ మూవీ విజయం సాధిస్తే, ఆ మూవీని ఇతర భాషల్లోకి రీమేక్  చేయడం అనేది సాధారణంగా జరిగే విషయమే. కానీ ఆ మూవీ డబ్ అయ్యి, థియేటర్లో రిలీజ్ అయిన తరువాత కొన్నేళ్లకు మళ్ళీ అదే సినిమాను అదే భాషలో తీయడం అనేది అరుదుగా జరుగుతుంది.

Video Advertisement

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన సూపర్ హిట్ మూవీ ‘తేరి’ ని 6 ఏళ్లక్రితమే నిర్మాత దిల్ రాజు ‘పోలీసోడు’ అనే టైటిల్ తో తెలుగులో డబ్ చేశారు. కానీ అంతగా ఆడలేదు. కట్ చేస్తే, ఆ మూవీనే చాలా మార్పులు చేసి హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా తెరకెక్కిస్తున్నారు.Ustad-Bhagat-Singhపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ గతంలో హిందీ ‘దబాంగ్’ మూవీని గబ్బర్ సింగ్ గా తీసి, ఇండస్ట్రీ హిట్ గా నిలిపాడు. దాంతో ఇప్పుడు తేరి రీమేక్ గా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని గబ్బర్ సింగ్  మించి, హిట్ చేస్తాడని పవన్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఇదే తేరి మూవీని బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కలీస్ తెరకెక్కించబోతున్నాడు. దీనిని డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు.వాస్తవానికి ‘తేరి’ స్టోరీ ఇప్పటిది కాదు. విజయ్ కాంత్ హీరోగా ఛత్రియన్ అనే చిత్రం 1990లోనే వచ్చింది. ఆ మూవీని తెలుగులో క్షత్రియుడు పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాకి దర్శకుడు మణిరత్నం కథను సమకూర్చగా, సుభాష్ దర్శకత్వం చేశారు. కథ విషయానికి వస్తే, హీరో భార్య విలన్ల చేతిలో చనిపోతుంది. దాంతో హీరో పోలీస్ జాబ్ వదిలి పిల్లలతో అజ్ఞాతంలోకి సాధారణ జీవితం గడుపుతుంటాడు.విలన్ జైలు నుంచి బయటికి వచ్చి, హీరో మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకునేలా చేస్తాడు. హీరో విలన్ ను చంపడంతో కథ ముగుస్తుంది. తేరిలో సమంత పాత్రను రేవతి, యామీ జాక్సన్ పాత్రను భానుప్రియ చేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పక్కన శ్రీలీల ఫిక్స్ కాగా, మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. హిందీలో హీరోయిన్స్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

Also Read: అప్పుడు గురూజీ కరెక్ట్ గానే చెప్పారు.. మనకే అర్ధం అవ్వలేదు..! ఈ వీడియో చూసారా..?

 


End of Article

You may also like