Ads
ఎంతో మంది తమ కెరీర్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెడతారు. తర్వాత కొద్ది సంవత్సరాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ హీరోగా లేదా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారు. అలా మన హీరోయిన్లు కొంత మంది చిన్నప్పుడు సినిమాల్లో నటించి తర్వాత మళ్లీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 కీర్తి సురేష్
కీర్తి సురేష్ పైలెట్స్ అనే ఒక మలయాళం సినిమాతో, పాటు ఇంకొక రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
#2 మంజిమా మోహన్
మంజిమా మోహన్ చాలా మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 2015 లో వచ్చిన ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టారు. ఈ సినిమా తెలుగులో మేడ మీద అబ్బాయి పేరుతో రీమేక్ అయ్యింది.
#3 నిత్యా మీనన్
నిత్యా మీనన్ ద మంకీ హూ న్యూ టూ మచ్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
#4 షామిలి
షామిలి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఎన్నో సినిమాల్లో, అలాగే హిందీలో కూడా కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఓయ్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టారు.
#5 శ్రావ్య
శ్రావ్య, సందడే సందడి సినిమాలో జగపతి బాబు, ఊర్వశి కూతురుగా నటించారు. ఆ తర్వాత లవ్ యూ బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించారు.
#6 మంచు లక్ష్మీ ప్రసన్న
మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్ బాబు గారు హీరోగా నటించిన పద్మవ్యూహం సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు.
#7 షాలిని
షాలిని కూడా ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. సఖి సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ని మొదలు పెట్టారు.
#8 టబు
టబు, దేవానంద్ గారి హమ్ నౌజవాన్ సినిమాలో ఒక టీనేజర్ గా నటించారు.
#9 గ్రీష్మ నేత్రిక
గ్రీష్మ నేత్రిక మల్లీశ్వరి సినిమాలో నరేష్ గారి కూతురు పాత్రలో నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో యుక్త వయసులో ఉన్నప్పుడు బసవతారకం గారి పాత్రలో నటించారు.
#10 నిత్య శెట్టి
నిత్య శెట్టి దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఓ పిట్ట కథ తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.
End of Article