కరోనా నేపథ్యంలో వైరల్ అయిన 5 ఫేక్ వీడియోస్ ఇవే..! వెనకున్న అసలు నిజం ఏంటంటే?

కరోనా నేపథ్యంలో వైరల్ అయిన 5 ఫేక్ వీడియోస్ ఇవే..! వెనకున్న అసలు నిజం ఏంటంటే?

by Anudeep

Ads

చైనాలోని వూహాన్లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్నది. దాంతో అందరూ చైనా కావలనే ఈ ప్రయోగం చేసిందని, చైనా బయో వార్లో భాగం అంటూ రకరకాల న్యూస్లు వచ్చాయి, వాటి ఆధారంగా చాలామంది చైనాపై ద్వేషం పెంచుకున్నరు, అది అక్కడితో అయిపోయింది. మన దేశానికి వచ్చేసరికి కరోనాకి మతం రంగు పులిమారు. కేవలం ముస్లింల వలనే కరోనా వ్యాప్తి చెందుతుందనే వదంతు రాత్రికి రాత్రే కరోనా కంటే వేగంగా వ్యాపించింది.

Video Advertisement

ముస్లింల వలన కరోనా వ్యాప్తిలో ఎంత నిజముందో కాని, ఆ పేరుతో వందల సంఖ్యలో వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి, వాటిల్లో ఏది నిజమో, ఏది ఫేకో తెలియకుండానే చాలామంది ఫార్వర్డ్ చేస్తున్నరు . సమాజానికి ఫేక్ మెసేజెస్ చాలా హానికరం.  ఈ మధ్యకాలంలో సర్క్యులేట్ అయిన ఫేక్ మెసేజెస్, వాటి వెనుక నిజాలు తెలుసుకోండి.

వీడియో 1 : ఓ పది మంది కలిసి ఖాళీ ప్లేట్లను , స్పూన్లను నాకుతూ దేశoలో కరోనా వ్యాపిస్తున్నారు అని వ్యాఖ్యానం జోడిస్తూ ప్రచారం చేస్తున్నారు .

నిజం : షియా ముస్లిం మతంలోని ఒక సంప్రదాయంలో భాగంగా , దేవుడిచ్చిన ఒక్క మెతుకును కూడా వృధా చేయకూడదు అనే భావనలో తమ సమిష్టి భోజనంలో ప్లేట్లు , స్పూన్లను క్లీన్ గా నాకుతున్న వీడియో ఇది .అది 2018లో వీడియో, అదే వీడియో ట్విట్టర్లో కూడా ఉంది. ఆ వీడియోకి కరోనా వ్యాప్తికి సంబంధం లేదు.

వీడియో 2 : రోడ్డు మీద తోపుడు బండి మీద ఒక ముస్లిం వృద్ధుడు ఆరెంజ్ పండ్లను అమ్ముకుంటూ , అలవాట్లలో భాగంగా తన ఆరెంజ్ పండ్లను చేతి వెళ్ళ తడితో కౌంట్ చేస్తున్నాడు . అతను ఇలా కరోనాను వ్యాప్తి చేస్తున్నాడు.అని వ్యాఖ్యానిస్తూ వీడియోను ప్రచారం చేస్తున్నారు .

నిజం : ఆ వీడియో కరోనా వ్యాప్తి చెందని కాలం వీడియో . ఈ విషయం మధ్యప్రదేశ్ పోలీసులకు కూడా తెలిసిన విషయం . అతని మానసిక అనారోగ్యం వల్ల డబ్బులు కౌంట్ చేస్తున్నట్లుగా చేస్తుంటాడు .నిజానికి ఆ వీడియోలో ఏ ఒక్కరికీ మాస్కులు లేవు. చుట్టూ జనసమూహం ఉంది .రోడ్లపై కార్లు , ఆటోలు యథావిధిగా నడుస్తున్నాయి.దుఖానాలు ఓపెన్ గా ఉన్నాయి. అవన్ని చూస్తుంటే అది పాత వీడియో అని క్లియర్ గా అర్దం అవుతుంది.కానీ , వాళ్ళేమో “ చూడండి ఈ వృద్ధుడు తన ఉమ్ము తడితో కరోనా ను వ్యాపింప చేస్తున్నాడు అని ప్రచారం చేసి , చిన్న చిన్న బిజినెస్ లు చేసుకునే వాళ్ళ మీద నెగెటివ్ ప్రచారానికి పూనుకుంటున్నారు. ఇది కూడా ఫేక్ వీడియోనే, దీనికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదు .

వీడియో 3 : పోలీసులు ఓ ఖైదీని పోలీసు వ్యానులో తీసుకెళ్తుంటే, ఓ కానిస్టేబుల్ కు అతనికి ఏం తగాదా వచ్చిందో , ఆ పోలీసు మీద ఉమ్మెస్తాడు ఒక వీడియోలో . ముస్లింలు ఈ విధంగా కరోనా వ్యాప్తి చేస్తున్నారు అని ఒక వీడియో వైరలవుతోంది.

నిజం : బొంబాయి లోని ఓ ఖైదీ వీడియో . అది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేసిన పాత వీడియో . పోలీసుల మీద కరోనాను ఇలా వ్యాపిస్తున్నారు అని రెచ్చగొట్టే వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ప్రచారం చేస్తున్నారు . ఇది ఫేక్ వీడియో, దీనికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదు .

వీడియో 4 : అట్లానే ఇంకో పాత వీడియోలో వారి ప్రార్థనలలో సమిష్టిగా, బలంగా శ్వాసను తుమ్ము లా వదిలె వీడియోని తీసుకొచ్చి, ప్రజల్లోకి వచ్చి తుమ్మేలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనే వీడియో ఒకటి వైరలవుతుంది.

నిజం : అది కూడా పాత వీడియోనే, అదే కాదు అలాంటి వీడియోలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి. నిజానికి అలా శ్వాస వదులుతూ, తల ఊపడం అనేది వారి సంప్రదాయంలో భాగంగా సూఫీ లోని జికర్ అనే ఆచారం . ఇది కూడా ఇండియా టుడేలో పబ్లిష్ అయిన పాత వీడియో. పూర్తిగా ఫేక్ వీడియో.

వీడియో 5: ముస్లిం లాగా వున్న ఒకతను పాప కార్న్ లాంటి ఫూడ్ ప్యాకెట్ లో , నోటితో గాలి ఊదుతూ ఉంటాడు . దీన్ని కూడా కరోనా వ్యాపిస్తున్న ముస్లిములు అనే వ్యాఖ్యానంతో ప్రచారం చేస్తున్నారు .

నిజం : ఇది కూడా ఓ పాత వీడియో . మలేషియా దేశంలో 1st May -2019 న రిలీజ్ అయిన వీడియో . నెట్ లో అప్పటినుండి వుంది . ఇది ఫేక్ వీడియో, దీనికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదు .

ఇంకా ఇట్లాంటి మరికొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అలాంటి వీడియోలు మీకు రాగానే అది ఫేక్ అని చెప్పండి. అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా కరోనా టెస్టులకి ముందుకు రాకపోతే వారికి నచ్చచెప్పి టెస్టు చేయించుకోవడానికి ఒప్పించండి, లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి.అంతే తప్ప ద్వేషం పెంచుకోవడం వలన ఉపయోగం ఉండదు.


End of Article

You may also like