Ads
శేఖర్ కమ్ముల గురించి తెలియని వాళ్లు ఉండరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఈ దర్శకుడు తీసుకు వచ్చారు. పైగా శేఖర్ కమ్ముల చిత్రాలు చాలా నేచురల్ గా ఉంటాయి. చూడడానికి ఎంతో ఆనందంగా, ఫ్రెష్ గా ఉంటాయి శేఖర్ కమ్ముల చిత్రాలు. అయితే ఈ రోజు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించి, విజయం సాధించిన నటీ నటుల గురించి చూద్దాం.
Video Advertisement
#1. కమలినీ ముఖర్జీ:
అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వం తో కమలినీ ముఖర్జీ కూడా పాపులర్ అయింది. ఈమె ఆనంద్ సినిమా తో పరిచయం అయింది. ఈ సినిమా కమలినీ ముఖర్జీ కి మంచి పేరు తీసుకువచ్చింది.
#2. సాయి పల్లవి
అలానే సాయి పల్లవికి శేఖర్ కమ్ముల ఫిదా తో పాపులారిటీ బాగా పెరిగింది. పైగా మంచి చిత్రాల్లో అవకాశాలు కూడా సాయి పల్లవి కి వస్తున్నాయి. చక్కటి నటనతో, డాన్స్ తో ఈమె అందర్నీ ఫిదా చేసేసి ఔరా అనిపిస్తోంది. పైగా పెద్ద పెద్ద స్టార్లు కూడా ఈమెని అభినందిస్తున్నారు.
#3. రానా
రానా లీడర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో రానా నటించి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది.
#4. ప్రియా ఆనంద్
ప్రియా ఆనంద్ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వం సినిమాతో వెలుగులోకి వచ్చింది. లీడర్ సినిమాతో ఈమె మంచి పేరు కూడా పొందింది.
#5. రిచా గంగోపాధ్యాయ
రిచా గంగోపాధ్యాయ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంతో ప్రశంసలు పొందింది. లీడర్ తరువాత ఆమెకు మంచి అవకాశాలు ఆమెకు తర్వాత వచ్చాయి.
#6. నిఖిల్
నిఖిల్ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంతోనే పరిచయం అయ్యాడు. హ్యాపీ డేస్ సినిమా ద్వారా మంచి క్రేజ్ నిఖిల్ కి దక్కింది.
#7. వరుణ్ సందేశ్
వరుణ్ సందేశ్ కూడా హ్యాపీ డేస్ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత మంచి సినిమాలు చేశాడు.
#8. సత్య కృష్ణ
ఆనంద్ ద్వారా సత్య కృష్ణ కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఆఫర్లు కూడా ఆమెకి వచ్చాయి.
#9. కృష్ణుడు
హ్యాపీడేస్ ద్వారా కృష్ణుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వివిధ సినిమాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి. హీరోగా కూడా నటించాడు.
#10. నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత మంచి సినిమాలులో అవకాశాలు కూడా నవీన్ పోలిశెట్టి సొంతం చేసుకున్నాడు.
End of Article