Ads
మనిషికి మనిషికి తోడు ఉంటే ఎంతో బాగుంటుంది. నిజానికి మనిషికి మనిషికి తోడు ఉంటేనే జీవితానికి అర్థం కూడా ఉంటుంది. భార్యకి భర్త, భర్తకి భార్య కష్టసుఖాలను పంచుకోవడానికి.. అండగా నిలవడానికి.. ప్రోత్సహించడానికి.. అభినందించడానికి… తప్పులని తెలియ చేయడానికి ఉండాలి. అది అవసరం కూడా. పైగా పెళ్లి ఒక గొప్ప సెక్యూరిటీని ఇస్తుంది.
Video Advertisement
మానసికంగా పెళ్లి ఒక గొప్ప శక్తిని కూడా ఇస్తుంది. కొందరు మగవాళ్ళు ఉద్యోగానికి వెళ్లక పోయినా సరే భార్యలు తమ సొంత జీతంతో ఇల్లును నెట్టుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు.
అటువంటి వాళ్లు ఎందుకు ఇంకా భర్తతో ఉన్నారు అంటే పెళ్ళితో మానసిక సెక్యూరిటీ వస్తుంది అలానే సోషల్ సెక్యూరిటీ కూడా. అందుకనే భర్త సంపాదించకపోయినా వారే కష్టపడి ఇంటిని నెట్టుకొస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో చాలా మంది 40 ఏళ్లు వచ్చినా సరే పెళ్లి చేసుకోవడం లేదు.
కుటుంబ పరిస్థితుల వలనో లేదూ అంటే ఉద్యోగం వల్లనో ఇలా వివిధ కారణాల వలన పెళ్లి చేసుకోవడం లేదు. అయితే పెళ్లి చేసుకోకపోవడం వలన వారికి తోడుగా ఎవరూ వుండరు. ఇప్పుడు ఎవరో ఒకరు వున్నా రేపన్న రోజు ఒంటరైపోతారు. అలానే అనారోగ్యం వచ్చినా చూసుకోవడానికి ఎవరు వుండరు. పైగా ప్రతీసారి ఒంటరిగా ఉండాలి. గెలుపుని పంచుకోవడానికి… ఓటమిలో సపోర్ట్ ఇవ్వడానికి కూడా నా అనే వారు వుండరు.
అందుకే పెళ్లిని పక్కన పెట్టేసి ఇంకా ఏవో సాధించాలనో.. బాధ్యతలని తీర్చాలనో అనుకోకండి. పెళ్లి తరవాత కూడా సాధించాలనుకున్నది అవుతుంది. మీ కలల్ని, మీ ఆశయాలని అప్పుడు కూడా పూర్తి చేసుకోవచ్చు. పైగా మంచి పార్టనర్ వస్తే జీవితమంతా అద్భుతంగా ఉంటుంది.
End of Article