చంద్రయాన్-3 మిషన్ లో ఆ చివరి 17 నిమిషాలు మాత్రమే ఎందుకు కీలకం..? సాఫ్ట్ ల్యాండింగ్ ఎలా జరుగుతుందంటే..?

చంద్రయాన్-3 మిషన్ లో ఆ చివరి 17 నిమిషాలు మాత్రమే ఎందుకు కీలకం..? సాఫ్ట్ ల్యాండింగ్ ఎలా జరుగుతుందంటే..?

by kavitha

Ads

యావత్ ప్రపంచ దృష్టి మొత్తం చంద్రయాన్-3 మీదనే ఉన్నాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ విజయవంతం అయితే ఇండియా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో ఖ్యాతి తారాస్థాయికి చేరుతుంది.

Video Advertisement

చందమామకు చేరువలో ఉన్న చంద్రయాన్-3 నేడు (ఆగస్ట్ 23) ల్యాండింగ్ కానుంది. ఈ చారిత్రత్మక ఘట్టాన్ని చూడడం కోసం భారత్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. అయితే ల్యాండర్‌ చంద్రుని పై సురక్షితంగా ల్యాండ్ కావడానికి ఆఖరి 17 నిమిషాలు అత్యంత కీలకం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 గత నెల బయలుదేరి, ఎట్టకేలకు ఆఖరి అంకానికి చేరుకుంది. కొన్ని గంటల్లో ల్యాండర్‌ చంద్రుని దక్షిణధ్రువం తొలి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. ఆ క్షణం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. దేశం మొత్తం ఇస్రో జయహో అని నినదిస్తోంది. ఈరోజు సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ మొదలుకాబోతుంది. సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు చందమామ ఉపరితలం పై ల్యాండర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లన్నిటిని పూర్తి చేశారు.
అయితే, ఈ మిషన్ లో చివరి 17 నిమిషాలు చాలా కీలకం. దీనిని ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని చెప్తున్నారు. ఈ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయితే దాదాపు జాబిల్లి ఉపరితలం మీదకి ల్యాండర్ సురక్షితంగా చేరుకున్నట్లే అని చెబుతున్నారు. ఈ ఆఖరి 17 నిమిషాలో ల్యాండర్ ఆటోమేటిక్ గా తనలోని ఇంజన్లను మండించుకోగలగాలి. అంతే కాకుండా ఈ చర్య కరెక్ట్ టైమ్ కి జరగడంతో పాటుగా దానికి అవసరమైన ఇంధనాన్ని కూడా ఉపయోగించుకోవడం అనేది అత్యంత కీలకం.
దీనిలో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా ప్రయోగం అంతా విఫలం అవుతుంది. అందువల్లే ఉత్కంఠంగా యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు కంట్రోల్ రూమ్‌ల వద్ద అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో చంద్రయాన్-2 ఎగుడుదిగుడుగా ఉన్న ప్రాంతాన్ని ఢీకొనడంతో కూలిపోయింది. ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read:  వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో పక్షులు ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి..? దీని మీద అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే..?


End of Article

You may also like