Ads
మణిరత్నం దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఇండియన్ సినిమాలో బాహుబలి అనేది ఇతర సినిమాలకు ఒక రోడ్ మోడల్ లాంటిది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ మణిరత్నం కూడా ఇదే రూట్ ను ఫాలో అవుతున్నట్లు ఉన్నారు. ఈ చిత్రానికి గాను బి. జయ మోహన్ మాటల రచయితగా వ్యవహరించారు.
Video Advertisement
ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, త్రిష, జయం రవి, శోభిత ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ వంటి వారు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ అనేది ఒక హిస్టారికల్ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం. 1950లో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని తీయడం జరుగుతుంది. చోళ రాజుల కథాంశంగా దీనిని రెండు భాగాలు PS-I, PS-II చిత్రీకరించడానికి సన్నాహాలు సిద్ధంచేస్తున్నారు. పంచవ్యాప్తంగా ps-I చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు.
సోషల్ మీడియాలో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే మన రాజమౌళి తీసిన బాహుబలి బిగినింగ్, బాహుబలి కంక్లూజన్ చిత్రాలు లాగానే ఈ పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని కూడా తీస్తున్నట్లు తెలుస్తుంది. పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా చిత్రం రూపొందడం జరిగింది. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలోని సన్నివేశాలు చూస్తూంటే గతంలోనే బాహుబలి చిత్రంలో సన్నివేశాలు మాదిరిగా ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.
ఇలా కనిపించడానికి గల కారణాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే పొన్నియన్ సెల్వన్ చిత్రంనికి ముందే మన బాహుబలి చిత్రం ఘన విజయం సాధించింది. దీనిలోని ప్రతీ సన్నివేశం ప్రేక్షకులకు ఇప్పటికీ కంటికి కట్టినట్టు కనిపిస్తాయి. బాహుబలిలో ఈ సన్నివేశాలు పూర్తిగా పొన్నియన్ సెల్వన్ నవల నుండి ప్రేరణ పొందింది. అందుకే బాహుబలి చిత్రంలోని సన్నివేశాలు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో సన్నివేశాలు మాదిరిగా కనిపిస్తున్నాయి.
పొన్నియన్ సెల్వన్ నవల ఆధారితంగా సన్నివేశాలను బాహుబలి చిత్రంలో చూపించినట్లు బుక్ లో వివరించబడ్డాయి. ఈ బాహుబలి చిత్రం మాత్రమే కాకుండా RRR కూడా పొన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా ఉన్న కొన్ని సన్నివేశాల కూడా చిత్రీకరించబడింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This scene in bahubali was completely inspired from ponniyinselvan… Ponniyinselvan was written in 1950 by kalki same scene where described in d book as it was shown in bahubali… "Mandhagini will save Raja Raja cholan from cauvery in same way"#PS1#PonniyinSelvanTeaser pic.twitter.com/UoNUXhtyAz
— 𝚜𝚒𝚟𝚊💞🎭 (@iamshiva1710) July 8, 2022
End of Article