ఏ షాపులు ఓపెన్ చేసుకోవచ్చు అంటే…కానీ షరతులు ఇవే..!

ఏ షాపులు ఓపెన్ చేసుకోవచ్చు అంటే…కానీ షరతులు ఇవే..!

by Anudeep

Ads

లాక్​డౌన్ ఎప్పుడు తీసేస్తారో ఏంటో? పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే ఇప్పట్లో తీసేసేలా లేరు అనుకుంటున్నారా? అది నిజమే .. పరిస్థితి ఇలాగే ఉంటే మే3 తర్వాత కూడా కొనసాగించవచ్చు. కాని కొన్ని ఉపశమనాలు కలిగిస్తుంది ప్రభుత్వం.. మాల్స్ మినహా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లో రిజిస్టర్ అయిన అన్ని షాపులు తెరుచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి ఆదేశాలిచ్చింది..కానీ షరతులు వర్తిస్తాయి..అవేంటో చదవండి.

Video Advertisement

కేవలం నివాస ప్రాంతాల్లో మార్కెట్ కాంప్లెక్స్ లు, అన్ని రిజిస్టర్డ్ దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చింది కేంద్రప్రభుత్వం. కానీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, కంటైన్మెంట్ జోన్లు, కరోనా హాట్ స్పాట్ జోన్లలో మాత్రం మల్టీ బ్రాండ్ మాల్స్ లో ఉన్న షాపులకు మాత్రం అనుమతులు లేవు.అనుమతులతో పాటుగా కొన్ని షరతులు విధించింది. అవేంటంటే 50 శాతం సిబ్బందితో మాత్రమే షాపులు తెరవాలి. మాస్కులు, హ్యండ్ గ్లోవ్స్ కచ్చితంగా ధరించాలి. అంతేకాదు సోషల్ డిస్టెన్స్ పాటించి తీరాల్సిందే.

అయితే ఇవన్ని కూడా కేంద్ర ఇచ్చిన మినహాయింపులు, ఇవి అమలయ్యేది లేనిది రాష్ట్రాలు విధించిన నిబంధనలపై ఆధారపడతాయి. ఈ మినహాయింపుల ప్రకారం వేటికి పర్మిషన్ ఉంది, వేటికి లేదో తెలుసుకోండి. ఈ రోజు నుంచి తెరిచేందుకు పర్మిషన్ ఉన్నవి:

పర్మిషన్ ఉన్నవి:

  • గ్రామీణ ప్రాంతాల్లో నమోదు చేసుకున్న అన్ని దుకాణాలు, మార్కెట్లు
  • పట్టనాలు, నగరాల్లో  ఇండిపెండెంట్ దుకాణాలు మాత్రమే
  • ఇండిపెండెంట్ టైలర్ షాపులు,
  • హెయిర్ కటింగ్ షాపులు కూడా ఓపెన్ చేయొచ్చు (మల్టీ బ్రాండ్ షాపింగ్ మాల్ లో లేనివి మాత్రమే)

పర్మిషన్ లేనివి:

బార్‌లు, వైన్​షాపులు, మల్టీ-బ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్‌లు, జిమ్ లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లు, ఆడిటోరియంలు


End of Article

You may also like