జూనియర్ ఎన్టీఆర్ “ఆస్కార్” వరకు వెళ్లి ఉంటే..? ఈ 5 విషయాలు జరిగేవి కదా..?

జూనియర్ ఎన్టీఆర్ “ఆస్కార్” వరకు వెళ్లి ఉంటే..? ఈ 5 విషయాలు జరిగేవి కదా..?

by Mohana Priya

Ads

ఒక సినిమాకి చాలా ముఖ్యమైన వారు అందులో నటించే నటీనటులు. ఒకరకంగా వారు లేకపోతే సినిమానే ఉండదు. దర్శకుడు అనుకున్న పాయింట్ ని తెరపై చూపించడానికి నటీనటులు ఆ ఎమోషన్ తెరపై వచ్చే బాధ్యత తీసుకుంటారు. పాత్రల ఎంపిక ఎంత బాగుంటే సినిమా అంత బాగుంటుంది. ఇంక హీరోలపై అయితే సినిమా బాధ్యత అంతా ఉంటుంది. వారు సరిగ్గా చేస్తే సినిమా హిట్ అవుతుంది. వారు ఇంకా బాగా చేస్తే సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది.

Video Advertisement

అందుకే వారి పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తూ ఉంటాయి. కొంత మంది హీరోలు కొన్ని సినిమాల్లో చేసిన నటనకి ఎంత పెద్ద అవార్డ్ ఇచ్చినా తక్కువే అన్నట్టు ఉంటాయి. అలా ఇటీవల కొమరం భీమ్ పాత్రలో కేవలం జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. సినిమా మొత్తం ఒక ఎత్తు లాగా ఉంటే కేవలం కొమరం భీముడో పాటలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ సినిమాని ఇంకా హైలైట్ అయ్యేలా చేశాయి.

netizens trolling ntr bike lifting scene in rrr

నిజంగా అంత బాధ అనుభవిస్తున్న వ్యక్తి ఎలా అయితే ఉంటాడో తెరపై జూనియర్ ఎన్టీఆర్ అలాంటి నటనని ప్రేక్షకులకి అందించారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు. నామినేషన్స్ కి కూడా వెళ్లే అవకాశం ఉంది అని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కేవలం నాటు నాటు పాట మాత్రమే నామినేషన్స్ కి వెళ్ళింది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఆస్కార్ నామినేషన్ కి వెళ్లి ఉంటే? అంతే కాకుండా నామినేషన్ కి వెళ్ళిన తర్వాత ఆస్కార్ కూడా వచ్చి ఉంటే? అలా అయ్యుంటే జరిగే విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

these two scenes missing in rrr

#1 జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ఆస్కార్ నామినేషన్ కి ఎంపిక అయ్యి ఉంటే ఇప్పటివరకు ఆస్కార్ వరకు వెళ్ళిన మొదటి భారతీయ హీరో అయ్యేవారు. ఇలాంటి ఘనతని సాధించిన హీరోగా ఇంకా ఎక్కువ గుర్తింపు పొందేవారు.

rrr trailer analysis and hidden details

#2 సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో సినిమా వాళ్లకి భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే గుర్తొస్తుంది. అందుకే చాలా మంది భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాల పేర్లు మాత్రమే చెప్తారు. అంతే కాకుండా వారికి కేవలం బాలీవుడ్ నటులు మాత్రమే తెలుసు. కానీ ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ వరకు వెళ్లి ఉంటే సౌత్ సినిమా, అందులోనూ తెలుగు సినిమా అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేది.

rrr trailer analysis and hidden details

#3 సాధారణంగా సౌత్ సినిమా అంటే హాలీవుడ్ వాళ్ళకి మాత్రమే కాదు బాలీవుడ్ వాళ్ళకి కూడా ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది. సౌత్ సినిమాల్లో అతిగా చూపిస్తారు, ఫైటింగ్ కూడా చాలా ఓవర్ గా ఉంటాయి అని చాలా సార్లు కామెంట్స్ వచ్చాయి. అందుకే సౌత్ సినిమాలని బాలీవుడ్ లో ఏదైనా సినిమాలో చూపించినా కూడా చాలా నాటకీయంగా చూపిస్తారు. కానీ సౌత్ సినిమాలో నిజానికి అలా ఉండవు. సౌత్ లో కూడా సహజంగా నటించే నటీనటులు చాలా మంది ఉంటారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ స్థాయిలో రుజువు చేసే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అవుతారు.

unnoticed details in janani rrr song

#4 జూనియర్ ఎన్టీఆర్ కి జపాన్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నటించిన చాలా పాటలని వాళ్ళు డ్యాన్స్ చేసి వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ వరకు వెళ్లి ఉంటే ఆ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేది ఏమో. ఇప్పటికే నాటు నాటు పాట ద్వారా ఇద్దరు హీరోలు ఫేమస్ అయ్యారు. కానీ ఆ పాటలో కేవలం వారి డాన్స్ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ వేరే క్యాటగిరి లో నామినేట్ అయ్యి ఉంటే వారి నటన కూడా అంతర్జాతీయ స్థాయిలో తెలిసేది.

unnoticed details in janani rrr song

#5 బాహుబలి తర్వాత చాలా మంది డైరెక్టర్లు వారి సినిమాలని పాన్-ఇండియన్ రేంజ్ లో విడుదల చేశారు. సినిమాల గురించి మాట్లాడుతూ అందులో చాలా మంది వారికి స్ఫూర్తి రాజమౌళి అని చెప్పారు. అలా రాజమౌళి తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ వరకు వెళ్లి ఉంటే తెలుగు సినిమాని మరొక స్థాయికి తీసుకువెళ్లిన మొదటి నటులు జూనియర్ ఎన్టీఆర్ అయ్యేవారు. నటన విషయంలో ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తారు.

జూనియర్ ఎన్టీఆర్ కి నిజంగా ఆస్కార్ నామినేషన్ లో స్థానం దక్కి ఉంటే వీటిలో కొన్ని విషయాలు అయినా కచ్చితంగా జరిగేవి ఏమో. ఏదేమైనా సరే ఇప్పటికి అయినా కూడా మన తెలుగు సినిమా స్థాయిని వీరందరూ కలిసి అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకువెళ్లడం అంటే గొప్ప విషయం.


End of Article

You may also like